Today Horoscope: డిసెంబర్ 18వ తేదీ ఆదివారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి!

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. చాలా కాలం నుండి వాయిదా పడ్డ పనులన్నీ ఇతరుల సహాయంతో పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. కొన్ని దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణం చేసేటప్పుడు విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది.

వృషభరాశి: ఇంటా బయట బాధ్యతలు ఒత్తిడికి గురి చేస్తాయి!

ఇంటా.. బయట.. బాధ్యతలు ఒత్తిడికి గురిస్తాయి. ఇతరుల నుండి రావలసిన సొమ్ము ఆలస్యం అవుతుంది. వ్యాపార విషయాలు ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య విషయాలు అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారంలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడటమే మంచిది.

మిధునరాశి: ముఖ్యమైన పనిలో శ్రమకు తగిన ప్రతిఫలం ఉండదు!

ముఖ్యమైన పనిలో శ్రమకు తగిన ప్రతిఫలం ఉండదు. కొన్ని దూర ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. దేవదర్శనం చేసుకుంటారు. భూమికి సంబంధించిన విషయాల్లో సోదరులతో వాదనలు జరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కర్కాటక రాశి: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు!

చేపట్టిన పనులు సకలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో జీతభత్యాలు విషయాలను అనుకూలత కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది. స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు. కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది.

సింహరాశి: మానసిక చికాకులు పెరుగుతాయి!

మానసిక చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. కుటుంబం సభ్యులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కన్యరాశి: వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి!

వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహమున దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు తగిన అవకాశాలు లభిస్తాయి. కొన్ని చెడుసావాసాలకు దూరంగా ఉండడమే మంచిది. మీరంటే గిట్టని వారు మీ విషయాలు తలదూచడానికి ప్రయత్నిస్తారు. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి. ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

తులరాశి: పని ఒత్తిడి వలన తాగిన విశ్రాంతి ఉండదు!

పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు.ఇంటా బయట సమస్యల అధికమవుతాయి. వృత్తి వ్యాపారాల్లో తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకొని నష్టపడతారు. కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది. ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

వృశ్చికరాశి: దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి!

దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణం చేసేటప్పుడు విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. చాలా సంతోషంగా ఉంటారు.

ధనుస్సురాశి: మొండి బాకీలు వసూలు అవుతాయి!

మొండి బాకీలు వసూలు అవుతాయి. బంధుమిత్రుల సమగమం ఆనందం కలిగిస్తుంది. ఆదాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలు అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. పెద్దవారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనుల్లో అంతా మంచే జరుగుతుంది. చాలా ఉత్సాహంగా ఉంటారు.

మకరరాశి: వృత్తి ఉద్యోగాలు పని ఒత్తిడి అధికమవుతుంది!

వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి అధికమవుతుంది. ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. నూతన ఋణ యాత్నాలు కలిసిరావు. ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

కుంభరాశి: ఆరోగ్య విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి!

ఆరోగ్య విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి. ప్రారంభించిన పనులను వాయిదా వేయడమే మంచిది. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లభిస్తాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. పాత విషయాలను జ్ఞాపకం చేసుకుంటారు.

మీనరాశి: వ్యాపార పరంగా కుటుంబ సభ్యుల సలహాలు సహకారాలు అందుతాయి!

వ్యాపార పరంగా కుటుంబ సభ్యుల సలహాలు సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి నిరుద్యోగులకు ప్రయత్నం గా అవకాశములు అందుతాయి. కొన్ని వ్యవహారాల్లో తీసుకున్న నిర్ణయాలు తరువాత కాలానికి ఉపయోగపడవు. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.