Today Horoscope: డిసెంబర్ 17వ తేదీ శనివారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: వ్యాపార పనులలో చికాకులు ఎదురవుతాయి!

వ్యాపార పనులలో చికాకులు ఎదురవుతారు. కానీ సమస్యల నుంచి బయటపడడానికి మార్గాలు అనుకుంటారు. వ్యాపారానికి సంబంధించిన ప్రభుత్వ వ్యవహారాలను సకలాలు పరిష్కరించడం అవసరం మీ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాల్లో పని భారం వలన కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కొన్ని దూరప్రాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది.

వృషభరాశి: వ్యాపారాలు ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి!

వ్యాపారాలు ఉద్యోగాల్లో పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. కొందరి ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకండి. మీ మాటలతో ఇతరుల మనసుని ఆకట్టుకుంటారు. శత్రువుల సైతం మిత్రులుగా మార్చే గుణం మీలో ఉంటుంది.చాలా సంతోషంగా ఉంటారు.

మిధునరాశి: ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు తప్పవు!

ఆరోగ్య పరంగా కొన్ని చికాకులు తప్పవు. సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. ప్రారంభించిన పనులను వాయిదా వేయడమే మంచిది. ఆర్థికంగా కొంత డబ్బు పొదుపు చేయాల్సి ఉంటుంది. పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచన చేస్తారు. మీ పాత స్నేహితులను కలుసుకుంటారు. వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

కర్కాటక రాశి: వ్యాపారాలు అహించిన రీతిలో రాణిస్తాయి!

బంధుమిత్రులతో సఖ్యత కలుగుతుంది. ఉద్యోగాల్లో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగ అధికారుల అనుగ్రహం పొందుతారు. కొన్ని పనులు సకలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. కొన్ని దూరప్రాణాలు చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

సింహరాశి: కుటుంబ సభ్యులతో విభేదాలు కలుగుతాయి!

కుటుంబ సభ్యులతో విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. నూతన రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాల వలన మార్గవరోధాలు కలుగుతాయి. మీ చిన్ననాటి స్నేహితుల నుండి ఆహ్వానాల అందుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది. ప్రారంభించిన పనులను వాయిదా వేయడం మంచిది.

కన్యరాశి: వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి!

వ్యాపారాల అభసటిగా సాగుతాయి. అప్పుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో సమస్యలు తొలుగుతాయి. చిన్ననాటి మిత్రులు కలయిక ఆనందం కలిగిస్తుంది. విందు వినోదాధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. ప్రారంభించే పనుల్లో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

తులరాశి: ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం!

ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార ఉద్యోగాల్లో ఇబ్బందులు తప్పవు. వృధా ఖర్చుల విషయాలలో పునరాలోచనచెయ్యాలి.కుటుంబ సభ్యులతో వాదనలు చికాకు పరుస్తాయి.మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చ చేస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

వృశ్చికరాశి: చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు!

చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమైతాయి. వ్యాపార ఉద్యోగాల్లో ఒత్తుడులు తొలగుతాయి. నూతన వస్తువులను కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోని చోటు నుండి ఆహ్వానాలు అందుతాయి. భవిష్యత్తులో పెట్టుబడునుండి మంచి లాభాలను అందుకుంటారు. చాలా ఉత్సాహంగా ఉంటారు.

ధనుస్సురాశి: చిన్ననాటి మిత్రులను కలుసుకొని కీలక విషయాలు చర్చలు చేస్తారు!

చిన్ననాటి మిత్రులను కలుసుకొని కీలక విషయాలు చర్చలు చేస్తారు. దీర్ఘకాలిక వివాదాలు తిరిగి ఊరట చెందుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూల మార్పులు ఉంటాయి. విద్యార్థులకు నూతన విద్య అవకాశములు లభిస్తాయి. సంఘటనలు పేరు కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు.

మకరరాశి: చేపట్టిన వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి!

చేపట్టిన వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. దైవచింతన పెరుగుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అనారోగ్య సమస్య చికాకు పరుస్తాయి. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

కుంభరాశి: చేపట్టిన పనులు మందగిస్తాయి!

చేపట్టిన పనులు మందగిస్తాయి. వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఉద్యోగాల్లో అధికారుల నుంచి సమస్యలు తప్పవు. నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు. ఇంటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.

మీనరాశి: మొండి బాకీలు వసూలు అవుతాయి!

కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వాహన యోగం ఉన్నది.ఉద్యోగ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగమున జీతభత్యములు విశాల శుభవార్తలు అందుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. చేపట్టిన పనులు సకలంలో పూర్తి చేస్తారు. కొందరు ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి.