Today Horoscope: డిసెంబర్ 11 వ తేదీ ఆదివారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: బంధు వర్గం నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది!

బంధు వర్గం నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. వ్యాపారాల్లో చిన్నపాటి సమస్యలు తప్పవు. ఉద్యోగాల్లో ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి. స్థిరస్తులు క్రయవిక్రయాల్లో ఆటంకాలు కలుగుతాయి. భూమికి సంబంధించిన విషయాల్లో మీరు తలదూర్చకుండా ఉండడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

వృషభరాశి: వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు!

వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. ఉద్యోగాల్లో అవంతారాలు తొలగిపోతాయి. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొన్ని దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.

మిధునరాశి: కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు నిలకడగా ఉండవు!

కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు నిలకడగా ఉండవు. సోదరులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఋణ ఒత్తుడులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. చేపట్టిన పనులు నిదానిస్తాయి. స్నేహితుల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

కర్కాటక రాశి: పనులు సకలంలో పూర్తి చేస్తారు!

పనులు సకలంలో పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు అందరికీ నచ్చుతాయి. భూక్రమవిక్రయాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఆశాజనకంగా ఉంటాయి. పాత సంఘటనలు జ్ఞప్తికి వస్తాయి. ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.

సింహరాశి: నూతన ఉత్సాహంతో విజయాలు సాధిస్తారు!

నూతన ఉత్సాహంతో కొన్ని వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కీలక సమయాల్లో కొన్ని సలహాలు కలిసి వస్తాయి. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత లభిస్తాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులు నిరీక్షణ ఫలిస్తుంది. వ్యాపారంలో పెట్టుబడి విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

కన్యరాశి: ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణాలు చేసుకుంటారు!

ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణాలు చేసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ప్రయాణాలు వాయిదా పడతాయి. మీరు చేసే ప్రయాణం కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. బంధువులతో ఆకారణ విభేదాలు తప్పవు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

తులరాశి: ఆర్థిక లావాదేవులు కొంత నిరుత్సాహపరుస్తాయి!

ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పవు. దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి.

వృశ్చికరాశి: వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి!

వ్యాపారాలు లాభ బాటల సాగుతాయి. పనుల్లో చికాకులు పెరుగుతాయి. ఉద్యోగాల్లో మీ హోదా పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

ధనుస్సురాశి: ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది!

ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. బయట ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోండి.

మకరరాశి: దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు!

దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో అవరోధాలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో కొత్త సమస్యలు తప్పవు ఆత్మీయులతో కొన్ని విషయాలలో విభేదాలు కలుగుతాయి. ప్రయాణాలు ఉంటాయి. తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఈరోజు ఆరోగ్యం కుదుట పడుతుంది.

కుంభరాశి: ఉద్యోగాల్లో స్థానచలనసూచనలు ఉన్నవి!

ఉద్యోగంలో స్థానచలన సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరిస్తుంది. వ్యాపారాలు నూతన సమస్యలు కలుగుతాయి. పెట్టుబడి విషయాల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడం మంచిది. నూతన రుణాలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. చాలా సంతోషంగా ఉంటారు.

మీనరాశి: ఆర్థిక సంతాపృకరంగా సాగుతుంది!

ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు పలుస్తాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి కలుగుతుంది. వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. అప్పుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.