మేషరాశి: గృహమున పెద్దల ఆరోగ్య విషయం ఆందోళన కలిగిస్తుంది!
గృహమున పెద్దల ఆరోగ్య విషయం ఆందోళన కలిగిస్తుంది. స్వల్ప వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇతరులకు ధన వ్యవహారాల్లో మాట ఇవ్వకపోవడం మంచిది. ఆర్థికంగా కొంత డబ్బు పొదుపు చేయాల్సి ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
వృషభరాశి: అనేక సమస్యలకు పరిష్కారాలు కనుగొంటారు!
అనేక సమస్యలకు పరిష్కారాలు కనుక్కుంటారు. కొన్ని విషయాల గురించి కొంత ఆందోళన చెందుతారు. ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడమే మంచిది. మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. దీని వలన మీకు కొంత ఒత్తిడి తగ్గుతుంది. ఇతరుల నుండి మీ సొమ్ము సమయానికి చేతికి అందుతుంది.
మిధునరాశి: మీ కుటుంబం నుండి పూర్తి మద్దతు లభిస్తుంది!
మీ కుటుంబం నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. దీనివల్ల మీకు చాలా సహకారికా ఉంటుంది. నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. వ్యాపారాల్లో పెట్టుబడి విషయాల గురించి ఆలోచనలు చేయడం ఎంతో మంచిది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇతరుల సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. బయట వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.
కర్కాటక రాశి: వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి!
కుటుంబ పరిస్థితి చికాకు కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు విశ్రాంతి తీసుకోవడం మంచిది. కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు. ఇతరుల నుండి రావాల్సిన సొమ్ము ఆలస్యం అవుతుంది. పెట్టుబడి విషయాలు మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.
సింహరాశి: ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు!
ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అంతగా అనుకూలించదు. వృధా ఖర్చుల విషయాల్లో జాగ్రత్త వ్యవహరించాలి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. రాజకీయ సభ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు అనుకూలుస్తుంది. దూర ప్రయాణాలు అంతగా కలిసి రావు. మానసిక ఆందోళన పెరుగుతుంది. శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.
కన్యరాశి: నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు!
నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగమున కొంత అనుకూలత కలుగుతుంది. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. భూమికి సంబంధించిన విషయాల్లో మీరు తలదూర్చకుండా ఉండడమే మంచిది. ఇతర వారిపై కోపం మీ కుటుంబ సభ్యులకు చూపిస్తారు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
తులరాశి: నూతన వస్తువులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు!
నూతన వస్తువులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొన్ని దూర ప్రయాణాలు మీకు లాభసాటిగా సాగుతాయి. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. నూతన రుణ ప్రయత్నాలు పలిస్తాయి.
వృశ్చికరాశి: ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి!
ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి తెలివిగా బయటపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనుల్లో అంతా మంచే జరుగుతుంది.
ధనుస్సురాశి: అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణ ఉంటుంది!
అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణ ఉంటుంది. నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు అదనపు పని బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
మకరరాశి: మొండి బాకీలు తీర్చగలుగుతారు!
మొండి బాకీలు తీర్చగలుగుతారు. నూతన ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆస్తి కొలిక్కి వివాదాలు వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రారంభించిన పనులు నిదానంగా సాగుతాయి. పెట్టుబడి విషయాలు మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడం మంచిది.
కుంభరాశి: నూతన కార్యక్రమాల్లో పాల్గొంటారు!
నూతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు. ఇతరుల నుండి రావాల్సిన సొమ్ము సమయానికి చేతికి అందుతుంది. మీ మాటలతో ఇతరుల మనసుని ఆకట్టుకుంటారు. మీరు ఏ పని ప్రారంభించిన అంతా మంచే జరుగుతుంది. కొన్ని దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి.
మీనరాశి: దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి!
దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రయాణం చేసేటప్పుడు విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీరు ఏ పని ప్రారంభించిన అంతా మంచే జరుగుతుంది. కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.