శ్రావణ మాసం స్పెషల్.. శివుడిని ప్రసన్నం చేసే ఐదు పవిత్ర ఆకులు ఇవే..!

హిందూ ధార్మిక సంప్రదాయాల్లో ప్రతి మాసానికి ప్రత్యేకత ఉంది. అయితే శ్రావణ మాసానికి ఉండే ప్రాధాన్యం మరే మాసానికి ఉండదనే చెప్పాలి. ముఖ్యంగా మహాదేవుడు ఈ మాసంలో ప్రత్యేకంగా పూజిస్తుంటారు భక్తులు. అందుకే, భక్తులు శ్రావణంలో శివాలయాలు తిరిగి, శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో విధాలుగా పూజిస్తారు. కానీ, ప్రాచీన గ్రంథాల ప్రకారం కొన్ని ఆకులు భోలే నాథ్‌కి అత్యంత ప్రీతికరమైనవిగా చెబుతారు. ఈ ఆకులు శ్రామణ మాసంలో శివుడికి సమర్పిస్తే, భక్తుడి కోరికలు త్వరగా నెరవేరతాయని విశ్వాసం. ఈ కథనంలో వాటి గురించి తెలుసుకుందాం.

శమీ ఆకులు: శివ పూజలో శమీ ఆకులు అత్యంత పవిత్రమైనవి. శ్రావణ మాసంలో శివలింగానికి శమీ ఆకులు సమర్పిస్తే దోషాలు తొలగి, సంపూర్ణ సౌభాగ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఈ శమీ వృక్షాన్ని పుణ్య వృక్షంగా పరిగణిస్తారు.

ధూతూర్ పువ్వులు: ధూతూర్ పువ్వులు లేదా ధతూర పువ్వులు భోలే నాథ్‌కి ప్రియమైనవి. విషాన్ని అదుపులో ఉంచే శక్తి ఈ పువ్వులో ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఈ పువ్వులను శ్రావణ మాసంలో సమర్పిస్తే, ప్రతి కోరిక మహాదేవుని అనుగ్రహంతో సఫలమవుతుంది.

భంగ్ ఆకులు: గంజాయి ఆకులు అంటేనే భంగ్ ఆకులు. ఇవి శివుడికి ప్రత్యేకంగా ఇష్టమైనవి. భంగ్ సమర్పిస్తే మనిషి లోపలి నెగటివ్ శక్తులు తొలగి, ఆనందం మరియు శాంతి కలుస్తుందని పండితులు చెబుతారు. ఆయుర్వేద ప్రకారం కూడా భంగ్‌కి ప్రత్యేక ఔషధ గుణాలు ఉన్నాయి.

తమలపాకులు: తమలపాకు లేకుండా శివ పూజ అసంపూర్ణం. తమలపాకు మూడు ఆకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సూచిస్తాయి. ఈ ఆకులు శివలింగానికి సమర్పిస్తే, శివుని ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి. విరిగిన లేదా నలిగిన తమలపాకు సమర్పించడం తప్పని పండితులు సూచిస్తారు.

దర్భ: దర్భ వేరు కూడా శివుడికి ప్రీతికరమని పురాణాలు చెబుతున్నాయి. దర్భ సమర్పించడం ద్వారా శక్తులు శుద్ధి చెంది, ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. శ్రావణ మాసంలో దర్భతో శివ పూజ చేయడం వల్ల భక్తుని కష్టాలు తొలగుతాయని నమ్మకం.

పవిత్ర శ్రావణ మాసంలో శివుడికి ఈ ఐదు పవిత్ర ఆకులు సమర్పిస్తే, ఆయన అనుగ్రహంతో భక్తుని కోరికలు సాఫీగా నెరవేరుతాయని మన పెద్దలు చెప్పిన మాట. అందువల్ల, ఈ శ్రావణంలో ‘ఓం నమః శివాయ!’ జపంతో ఈ ఆకులను సమర్పించి, భోలే శంకరుని అనుగ్రహం పొందుదాం. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రాసినది.. దీనిని మేము ధృవీకరించడం లేదు.)