హిందూ ధర్మంలో శని దేవునికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయనను కర్మఫలదాతగా, న్యాయ స్వరూపుడిగా పూజిస్తారు. ఇక శనివారం శనీశ్వరుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ రోజు ఆయనను ప్రార్థించడం వల్ల శని దోషాలు తగ్గుతాయని, శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వసించబడుతోంది. అందుకే శనివారం నాడు నీలం రంగు వస్త్రాలు ధరించి, నీలి అపరాజితా పుష్పాలతో శనిదేవునిని పూజించే సంప్రదాయం ఉంది.
శని భగవానునిపై భక్తులలో గాఢమైన విశ్వాసం ఉన్నప్పటికీ.. ఆయన విగ్రహాన్ని ఇంట్లో ఉంచకూడదనే విషయాన్ని చాలామంది భావించరు. జ్యోతిష్య నిపుణుల ప్రకారం శని దేవుడు శాపగ్రస్తుడు. ఆయన విగ్రహం ఇంట్లో ఉంచడం వలన శని దోష ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెబుతారు. శనీశ్వరుని తత్వమే కర్మల ఫలితాన్ని కఠినంగా ప్రసాదించడమే కనుక.. ప్రతిరోజూ ఆయనను దర్శించుకోవడం మంచిది కాదంట. ప్రత్యేకంగా ఇంట్లో ఆయన విగ్రహం ఉంచుకోవడం మంచిది కాదని చెబుతున్నారు.
పండితులు చెబుతున్న వివరాల ప్రకారం.. శనివారమే శనిదేవునిని పూజించడానికి శ్రేయస్కరం. అయితే ఆలయంలో మాత్రమే పూజించాలి. పైగా ఆయన ముఖం వైపు కాకుండా కేవలం పాదాలవైపు మాత్రమే చూడాలి. శనిదేవుడి కళ్ళలో నేరుగా చూడడం వల్ల ఆయన దృష్టి తీవ్రమై బాధలను కలిగించవచ్చని చెబుతారు. శని గ్రహం ప్రభావం కొంతకాలం కాదు.. దీర్ఘకాలంగా ఉంటుంది. అది శుభంగా ఉండవచ్చును, లేక అశుభమయ్యే అవకాశమూ ఉంది.
ఒకవేళ జాతకంలో శని దోషం ఉంటే, శనివారాల రోజు వ్రతం పాటించడం, నలుపు లేదా నీలి వస్త్రాలు ధరిచడం.. దానం చేయడం, నలుపు తిలకాన్ని దానం చేయడం వంటివి చేస్తే శనిని సంతృప్తి పరచవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. శనిదేవుని ఆరాధనలో నిబద్ధత, శ్రద్ధ అవసరం. శనిని ఇంట్లో పూజిస్తే శుభం కలుగుతుందన్న అపోహకి లోనవడం మంచిది కాదని చెబుతున్నారు. శనీశ్వరుడిని ధర్మబద్ధంగా ఆలయంలోనే పూజించాలని సూచిస్తున్నారు.