మనకు మామూలుగా వేసవికాలం వచ్చింది అంటే చాలు ఎన్నో రకాల పండ్లు లభిస్తూ ఉంటాయి. ముఖ్యంగా నీరు శాతం అధికంగా ఉన్న కాయలు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. అంటే మామిడి పండ్లు పుచ్చకాయలు, కర్బూజా పండ్లు దోసకాయలు మనకు ఎక్కడ చూసినా కూడా విరివిగా లభిస్తూ ఉంటాయి. వేసవి కాలం వస్తే చాలు దాహార్తిని తీర్చడానికి పండ్లు, డ్రింక్స్, జ్యుస్ వంటి వాటిని తీసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. పండ్లు, నీటి కూరగాయలు వేసవిలో మన శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడతాయి.
అలాగే అధిక శాతం నీరు కలిగిన పండ్లు ఆహారంలో చేర్చుకోవడం వల్ల వేసవికాలంలో వచ్చే ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. వేసవిలో దొరికే పుచ్చకాయ, కర్బూజలను కూడా ఎక్కువ మంది తింటారు. కొందరికి వీటిని విడివిడిగా తింటే మరికొందరు కలిపి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే మరి ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది అంటే చాలామంది చెప్పడానికి తెగ ఆలోచిస్తూ ఉంటారు. మరి ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేసవిలో దాహార్తిని తీర్చడానికి పుచ్చకాయను తరచుగా తీసుకోవాలి. ఇందులో 90% కంటే ఎక్కువ నీటి శాతం కలిగి ఉంటుంది.
ఈ పండు హైడ్రేషన్ పవర్‌హౌస్ అనడంలో ఆశ్చర్యం లేదు. పుచ్చకాయలో పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర ద్రవ సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది. పుచ్చకాయలో అధిక నీటి శాతంతో పాటు, విటమిన్ ఎ, సిలకు మంచి మూలం. వేసవికాలంలో విరివిగా లభించే పండ్లలో ఒకటి మస్క్‌మిలన్. దీనినే కర్బూజా అని అంటారు. ఇది తీపి వాసనతో ఆరెంజ్ రంగుతో అందంగా కనిపిస్తుంది. పుచ్చకాయతో పోలిస్తే కర్బూజాలో నీటి శాతం తక్కువగా ఉన్నప్పటికీ శరీరానికి అవసరమైన హైడ్రేషన్‌ను అందిస్తుంది. దీనిలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉన్నాయి. దీనిలోని బీటాకెరోటిన్ క్యాన్సర్ బారిన పడిన కణాలను తగ్గిస్తాయి. ఇందులో పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉన్నాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇందులో ఉండే అధిక ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచి, శరీరంలోని తెల్ల రక్త కణాలను వృద్ధి చెందేలా చేసి రక్తంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.. మరి వీటిలో ఆరోగ్యానికి ఏది మంచిది అన్న విషయానికి వస్తే..రెండు పండ్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు శరీరానికి తేమను రిఫ్రెష్‌గా అందిస్తాయి. అయితే పుచ్చకాయలో నీటి శాతం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కర్బూజ మొత్తం ఆరోగ్యానికి తోడ్పడే వివిధ రకాల పోషకాలను అందిస్తుంది. మొత్తానికి ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడంలో రెండూ పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా వేసవి నెలల్లో ఇవి ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు.