ముఖంపై వచ్చే మచ్చలు చూసి ఆందోళన చెందుతాం. బుగ్గలు ఎర్రబారడం, మచ్చలు చూసి ఫీలవుతాం. మొటిమలు అని కూడా భావిస్తాం. అయితే.. స్పైసీ ఫుడ్ తిన్న వెంటనే శరీరం, బుగ్గలు కొద్దిగా వెచ్చగా అనిపిస్తాయి. ముఖం ఎర్రబారినట్టు అనిపిస్తుంది. అలా ఏర్పడేవి రొసషియా అని గుర్తించాలి. ఇది ఒక క్రానిక్ కండిషన్. దీనివల్ల స్కిన్ ఎర్రబారడం, రఫ్ కావడం, పొక్కులు వచ్చినట్లుగా అవుతుంది. మంటగా అనిపించడం, చీము ఉండటం, కళ్ళ వాపు.. ఇలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తుంది. రొసషియా చూడడానికి సరిగ్గా యాక్నేలానే ఉంటుంది.
రొసషియా వల్ల ఎర్రదనం ఎక్కువగా ఉంటుంది, బుగ్గ లేదా నుదురు ఎర్రగా తయారవుతుంది. రొసషియా..30 ఏళ్లు దాటిన వారిపై ఎఫెక్ట్ చూపిస్తుంది. సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే బుగ్గలు, ముక్కు వద్ద చర్మం మందంగా తయారయ్యే అవకాశం ఉంది. యాక్నే యుక్త వయసులో బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, గట్టి పొక్కుల్లా వస్తుంది. ముఖం, వీపుపై కూడా ఎర్రబారే అవకాశాలు ఉన్నాయి.
రొజేషియా వచ్చేందుకు సరైన కారణాలు లేవు. స్పైసీ ఫుడ్, ఆల్కహాల్, వ్యాయామం వల్ల బాడీ, స్కిన్ టెంపరేచర్ మారి బ్లడ్ వెసెల్స్ పెద్దవై రొజేషియా రావొచ్చని అంటున్నారు. యాక్నే వల్ల వచ్చే మార్పులు.. ఒత్తిడి, ఆహారం, మెడికేషన్, పీరియడ్స్, ప్రెగ్నెన్సీ సమయాల్లో హార్మోనల్ ఉత్పత్తిలో మార్పులొచ్చి ఆయిల్ రిలీజ్ చేస్తుంది. ఇది స్కిన్ సెల్స్ తో కలిసి చర్మ రంధ్రాలని మూసేసి బ్యాక్టీరియాతో కలిసి ఇన్‌ఫ్లమేషన్ కి దారి తీస్తుంది.
యాక్నే తగ్గాలంటే.. రోజూ రెండు సార్లు ఫేస్ వాష్ చేసుకోవాలి. డైట్ లో పండ్లు కూడా తీసుకోవాలి. దిండు కవర్, టవల్ ను రెగ్యులర్ గా ఉతకాలి. పాలు, పాల పదార్ధాలు తగ్గించాలి. స్వీట్స్, వేపుళ్ళు, జంక్ ఫుడ్ తగ్గించాలి.
రోసషియా తగ్గాలంటే.. ఎండలో ఎక్కువగా తిరగకూడదు. సన్ స్క్రీన్ లోషన్ రాస్తూ ఉండాలి. ఆల్కహాల్ తగ్గించాలి. స్పైసీ, జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. వెచ్చని వాతావరణానికి దూరంగా ఉండాలి.
గమనిక: ఈ కథనం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. నిపుణలు, వైద్యుల సలహాలకు ఈ కథనం ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమైన మార్గం. మీ ఆరోగ్యానికి సబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.