షుగర్ వ్యాధితో బాధ పడేవాళ్లకు తీపికబురు.. ఆ వ్యాక్సిన్ తో సులువుగా షుగర్ కు చెక్!

దేశంలో ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా ఎంతోమందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో షుగర్ వ్యాధి ఒకటనే సంగతి తెలిసిందే. చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, సరైన జీవన శైలి లేకపోవడం వల్ల మధుమేహం నుంచి పూర్తిస్థాయిలో కోలుకోవడం విషయంలో చాలామందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే మధుమేహంతో బాధపడేవాళ్లకు అదిరిపోయే తీపికబురు వచ్చింది.

డయాబెటిస్ వ్యాక్సిన్ ను తీసుకోవడం ద్వారా టైప్2 షుగర్ తో బాధ పడేవాళ్లు షుగర్ కు దాదాపుగా చెక్ పెట్టవచ్చు. డెన్మార్క్ ఫార్మా దిగ్గజం నోవో నార్డిస్క్ కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం 2025 సంవత్సరంలో మన దేశానికి డయాబెటిస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది. వారానికి ఒకసారి ఈ వ్యాక్సిన్ తీసుకోవడం షుగర్ లెవెల్స్ పూర్తిస్థాయిలో అదుపులో ఉంటాయి.

ఇన్సులిన్ తో పోల్చి చూస్తే డయాబెటిస్ వ్యాక్సిన్ మరింత సమర్థవంతంగా పని చేస్తుందని తెలుస్తోంది. మన దేశంలో ప్రస్తుతం ప్రతి 10 మందిలో ఒకరు ఈ వ్యాధితో బాధ పడుతున్నారని సమాచారం అందుతోంది. చక్కెర ఉన్న ఆహారాలను పరిమితంగా తీసుకోవడం వల్ల మధుమేహం రానివాళ్లకు ఆ వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఎక్కువగా పని చేయని వాళ్లు షుగర్ ఉత్పత్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

షుగర్ ఉత్పత్తులు, జంక్ ఫుడ్ అంటే ఇష్టం ఉన్నవాళ్లు వారానికి ఒకసారి మాత్రమే ఈ ఉత్పత్తులను తీసుకుంటే మంచిది. మిల్లెట్స్ ను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కూడా షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవచ్చు. డయాబెటిస్ బారిన ఒక్కసారి పడితే జీవితాంతం ఇబ్బంది పడాల్సి ఉంటుంది.