చేపలను ఇష్టంగా తింటున్నారా… అయితే మీరు ఈ ప్రమాదంలో పడినట్లే?

fish-sustainanbel-759

చేపలు ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే విషయం మనకు తెలిసిందే.చేపలలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ కూడా ఇందులో పుష్కలంగా లభిస్తాయి. అందుకే చేపలను అధికంగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మనకు అందుతాయని నిపుణులు చెబుతుంటారు. అయితే తాజా అధ్యయనాల ప్రకారం చేపలు అధికంగా తీసుకుంటున్న వారిలో థైరాయిడ్ కొలెస్ట్రాల్ కొందరు మహిళలలో గర్భస్రావం అలాగే మరికొందరిలో క్యాన్సర్ రావడానికి కూడా కారణమవుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ జరిపిన అధ్యయనాలలో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.ప్రస్తుతం వాతావరణ కాలుష్యం అలాగే నీటి కాలుష్యం అధికంగా ఉంది ఈ క్రమంలోనే నదులు సరస్సులు కొలనులలో నీటి కాలుష్యం అధికంగా జరగడం వల్ల చేపలలో విషపూరితమైన రసాయనాలు పేరుకుపోయినట్లు ఈ అధ్యయనాలలో వెళ్లడయ్యాయి. ఈ చేపలలో 278 ఫరెవర్ రసాయనాలు ఉన్నట్లు ఈ అధ్యయనంలో వెళ్ళడైంది.

ఈ రసాయనం ఎక్కువగా గొడుగులు, మొబైల్ కవర్స్, రైన్ కోట్లు వంటి వాటర్ ప్రూఫ్ వస్తువులు తయారు చేయడంలో ఉపయోగిస్తారు. ఇక ఈ రసాయనం మనలో హార్మోన్ల పై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి.దీనివల్ల థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ సమస్యలు వెంటాడుతాయి ఇక గర్భిణీ స్త్రీలలో ఎక్కువగా గర్భస్రావం జరిగే సూచనలు కూడా ఉంటాయి. మరికొందరిలో బ్రెయిన్ ట్యూమర్ క్యాన్సర్ కు కూడా కారణం అవుతాయని నిపుణులు తెలియజేశారు.