పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తగ్గి బలహీనంగా మారడానికి కారణాలు తెలిస్తే ఆ తప్పులు అస్సలు చేయరు!

ఈ రోజుల్లో చాలామంది దంపతులు ఎదుర్కొనే సంతానలేమి సమస్యకు ప్రధాన కారణం పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తగ్గడం లేదా బలహీనంగా మారడం. పురుషుల్లో (స్పెర్ము కౌంటు) శుక్రకణాల సంఖ్య తగ్గితే సంతానోత్పత్తి పై తీవ్ర ప్రభావం పడుతుంది. శుక్రకణాలు నాణ్యత కలిగి ఉన్నప్పటికీ వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోవడానికి మన రోజువారి ఆహారపు అలవాట్లే కారణమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజు మనం తీసుకొని కొన్ని ఆహార పదార్థాల మరియు చెడు అలవాట్ల వల్ల పురుషుల్లో స్పెర్ము కౌంటు తగ్గి సంతాన ఉత్పత్తి పై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ప్రతిరోజు మోతాదుకు మించి అంటే రోజుకు నాలుగు కప్పుల కంటే ఎక్కువ టీ ,కాఫీ తాగితే ఇందులో ఉండే కెఫిన్ ఆల్కలైడ్ హార్మోన్లపై తీవ్ర ప్రభావం చూపి
శుక్రకణాల సంఖ్య తగ్గడం లేదా బలహీనంగా మారడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు ఆల్కహాల్ సేవించే వారిలో కూడా శుక్రకణాల సంఖ్య బలహీనపడి సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. కొందరిలో ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శుక్రకణాల సంఖ్య తగ్గి సంతాన ఉత్పత్తి సామర్థ్యం కోల్పోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ రోజుల్లో చాలామంది అధిక శ్రమ కారణంగా తీవ్రమైన ఒళ్ళు నొప్పులు,కీళ్ల నొప్పులు సమస్యలను అనుభవిస్తున్నారు. ఈ నొప్పుల తీవ్రత నుంచి బయటపడడానికి విచ్చలవిడిగా పెయిన్ కిల్లర్ మందులను వినియోగిస్తే స్పెర్ము కౌంటు తగ్గి సంతాన సామర్థ్యం కోల్పోతారు. ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తింటే ఇందులో ఉండే చెడు కొలెస్ట్రాల్ కారణంగా శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడమే కాకుండా వీటికి కదిలే శక్తి కూడా మందగిస్తుంది. కలుషిత నీటిలో పెరిగే చేపల్లో అధికంగా మెర్కురి మూలకం ఉంటుంది కావున ఈ చేపలను ఆహారంగా తింటే మెర్కురి శుక్రకణాల నాణ్యత పై ప్రభావం చూపి సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది.