ఈ చిట్కాలు పాటిస్తే ముఖంపై మచ్చలు, ముడతలు తొలగిపోతాయా.. ముఖం మెరిసిపోతుందా?

ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ఎంతోమందిని మచ్చలు, ముడతలు లాంటి సమస్యలు వేధిస్తున్నాయి. ఈ సమస్యలు చిన్న సమస్యలలా అనిపించినా ఈ సమస్యల వల్ల ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ముఖంపై మచ్చలు, ముడతలు తొలగిపోయే అవకాశాలు ఉండటంతో పాటు ముఖం మెరిసిపోతుంది. చిన్న చిన్న చిట్కాలు ముఖాన్ని కాంతివంతంగా చేయడంలో సహాయపడతాయి.

చర్మ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు ప్రతిరోజూ రోజుకు మూడుసార్లు ముఖాన్ని మంచి సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. అలోవెరా జెల్‌లో విటమిన్ క్యాప్సూల్స్ ను మిక్స్ చేసి ముఖానికి పట్టిస్తే మంచిది. ఈ మిశ్రమంతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే శుభ ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. బొప్పాయి గుజ్జుతో ముఖంపై మసాజ్ చేసుకుని అరగంట తర్వాత శుభ్రం చేసుకున్నా మంచి ఫలితాలను పొందవచ్చు.

ఆలుగడ్డ, టమాటా రసాన్ని ఫేస్ ప్యాక్ చేసిన అదిరిపోయే ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఆహారపు అలవాట్లు, సూర్యరశ్మి కూడా కొన్నిసార్లు ముఖంపై మచ్చలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. బీట్‌రూట్ ఫేస్‌ప్యాక్ వల్ల కూడా చర్మం నిగనిగలాడుతుందని చెప్పవచ్చు. నేచురల్ హోమ్ మేడ్ ఫేస్‌ప్యాక్ వల్ల చర్మం మెరిసే అవకాశం అయితే ఉంటుంది.

1 బీట్‌రూట్, శెనగపిండి 2 చెంచాలు, పెరుగు 1 చెంచా, కొద్దిగా తేనె కలిపి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేస్తే మంచిది. ముఖాన్ని బాగా శుభ్రం చేసుకుని ఫేస్ ప్యాక్ లను అప్లై చేయడం వల్ల మంచి జరుగుతుంది. చర్మపు మచ్చలు, మొటిమల సమస్యల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు.