ఈ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా… మీకు మతిమరుపు రావడం గ్యారెంటీ!

18-Serious-Side-Effects-Of-Junk-Foods-On-Your-Health

మన శరీర భాగాలలో మెదడు అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి.మన మెదుడు పని తీరు మెరుగుపడాలి అంటే ఎన్నో పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతో ముఖ్యం అయితే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు వారి ఆహార విషయంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే చాలామంది ప్రైడ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు అయితే ఇలాంటి ఫుడ్ కనుక ఎక్కువ తీసుకుంటూ ఉన్నట్లయితే మనలో జ్ఞాపకశక్తి తగ్గిపోయి మతిమరుపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా మనం చికెన్ లేదా చేపలను బాగా ఉడికించి తినడం వల్ల అందులో ఉన్నటువంటి పోషక విలువలు మన శరీరానికి అంది ఎంతో ఆరోగ్యంగా ఉంటాము అయితే చికెన్, చేపలు, పొటాటో, సమోసాలు వంటి వాటిని ఫ్రై చేసి తినడం వల్ల మెదడుపై అధిక ప్రభావం చూపించి మతిమరుపు రావడానికి కారణమవుతుందని తెలుస్తోంది. వీటితోపాటు ప్రాసెసింగ్ చేయబడిన పాస్తా బ్రెడ్ వంటి ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల కూడా మతిమరుపు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు పలు పరిశోధనల ద్వారా తెలియజేశారు.

కనోలా ఆయిల్ వంటి వెజిటబుల్ ఆయిల్స్‌లో ఇన్‌ఫ్లమేటరీ ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరుపై అధిక ప్రభావాన్ని చూపిస్తాయి.ఫలితంగా అల్జీమర్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది మీలో డిప్రెషన్(కుంగుబాటు), మెదడు ఆలోచనలకు సంబంధించిన కాగ్నిటివ్ సమస్యలను ప్రేరేపిస్తుంది. ఇక జున్నులో అధిక మోతాదులో సంతృప్త కొవ్వులు ఉంటాయి ఇవి మెదడు పనితీరుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. వీటితో పాటు మెర్క్యూరీ అధికంగా కలిగిన చేపలను తరచూ తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోతుందని నిపుణులు వెల్లడించారు.