సాధారణంగా మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా సరిపడినంత ఉప్పు కారం వేసుకుంటేనే ఆహారం చాలా రుచిగా ఉంటుంది. అలాకాకుండా తగినంత ఉప్పు కారం లేకపోతే మనం తీసుకున్న ఆహారం మనకు ఏ విధమైనటువంటి ప్రయోజనాలను కలిగించదు. అయితే తాజాగా పలు అధ్యయనాలలో భాగంగా ఎక్కువ కారం తీసుకున్నవారు ఎక్కువ జీవిత కాలం బ్రతుకుతున్నట్లు నిపుణులు వెల్లడించారు.
ప్రతిరోజు ఆహారంలో కారం ఎక్కువగా తినే వారు ఎక్కువ రోజులు జీవిస్తున్నారట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమే అంటున్నారు పరిశోధన నిర్వహించిన వైద్యులు. ఇటీవలే చైనాలోని కొన్ని ప్రాంతాల ప్రజల పైన నిర్వహించిన సర్వేల్లో ఈ ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. వారానికి రెండుసార్లు మాత్రమే కారం తినే వారితో పోలిస్తే ప్రతిరోజు కారం తినేవారే ఎక్కువ రోజులు జీవిస్తున్నారట. దీని ప్రకారం కారం తినని వారితో పోలిస్తే కారం అధికంగా తీసుకుని వారిలో 10% మరణాల రేటు తక్కువగా ఉందని సర్వే వెల్లడిస్తోంది.
ఈ విధంగా మన రోజువారి ఆహారంలో భాగంగా ఎక్కువగా కారం తీసుకోవడం వల్ల మరణాల సంఖ్య తగ్గి ఆయుష్షు పెరుగుతోందని నిపుణులు అధ్యయనం ద్వారా వెల్లడించారు.అయితే ఈ పరిశోధనలు చైనా ప్రజల జీవన విధానం పై నిర్వహించారు అయితే అన్ని ప్రాంతాలలోనూ ఇదే విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనడం మంచిది కాదు. ఇక కారం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా అని అధిక కారం ఉన్న పచ్చిమిర్చి,ఎండుమిర్చి మిరియాలు ఎక్కువగా తింటే జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. దాని ఫలితంగా కడుపులో మంట, గ్యాస్ట్రిక్, గుండె దడ వంటి అనేక సమస్యలు కూడా తలెత్తుతాయి. ముఖ్యంగా అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు కారం ఉప్పును బాగా తగ్గించాలని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకే తగిన మోతాదులో ఉప్పు కారం తీసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవు.