చల్లని వాతావరణంలో ఉడకబెట్టిన గుడ్లను తినొచ్చా? న్యూట్రిషన్ నిపుణులు ఏమంటున్నారంటే?

చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఉడకబెట్టిన గుడ్డును తప్పనిసరిగా తినాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తూ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ముఖ్యంగా న్యూట్రిషన్ లోపంతో బాధపడేవారు తప్పనిసరిగా రోజువారి ఆహారంలో ఒకటి లేదా రెండు గుడ్లను ఆహారంగా తీసుకోవచ్చు. అయితే చాలామంది గుడ్లను తినే విషయంలో అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. కొలెస్ట్రాల్ సమస్య అధికంగా వేధించే చలికాలం లాంటి సీజన్లలో గుడ్డును ఆహారంగా తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ శాతం అధికం అయ్యి గుండెపోటు, రక్తపోటు, ఉబకాయం వంటి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని గుడ్డును తినడం మానేస్తున్నారు. ఇది కేవలం అపోహ మాత్రమే..

వైద్యుల సూచనల ప్రకారం శీతాకాలంలో మన శరీరంలో కొవ్వు నిల్వలు కొంత ఎక్కువగా ఉంటాయన్న విషయం వాస్తవమే అయినప్పటికీ ప్రతిరోజు గుడ్డును తింటే ఈ సమస్య మరింత తీవ్రం అవుతుంది అనడం అవాస్తవం అంటున్నారు. గుడ్డులో సమృద్ధిగా లభించే అమైనో ఆమ్లాలు,యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ప్రభావాన్ని తగ్గించి మన శరీరానికి అవసరమైన కొవ్వు నిల్వలను సమృద్ధిగా అందిస్తుంది తద్వారా జీవక్రియలు సక్రమంగా జరిగి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా చలికాలంలో శరీర ఉష్ణోగ్రతలు తగ్గి జీవక్రియ రేటు కూడా మందగిస్తుంది
కావున ప్రతిరోజు అల్పాహారంలో ఉడకబెట్టిన గుడ్డును ఆహారంగా తీసుకుంటే వీటిలో సమృద్ధిగా లభించే ప్రోటీన్స్, క్యాల్షియం, అమినో ఆసిడ్స్ శరీరం లోపల వేడిని కలిగించి శరీర ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరిస్తుంది. ఐరన్ లోపంతో బాధపడేవారు ముఖ్యంగా చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు చలికాలంలో గుడ్డును ఆహారంగా తీసుకుంటే ఐరన్ శోషణ సమృద్ధిగా జరుగుతుంది తద్వారా రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి మనలో రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. ప్రోటీన్ లోపంతో బాధపడుతున్న పిల్లలకు ప్రతిరోజు ఉడకబెట్టిన గుడ్డును ఆహారంగా ఇస్తే మెదడు ఆరోగ్యాన్ని రక్షించే ఒమేగా 3, కొవ్వు ఆమ్లాలు,కోలిన్, విటమిన్ బి12 సమృద్ధిగా లభించి మెదడును చురుగ్గా ఉంచడంతోపాటు జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని సంపూర్ణంగా నివారించవచ్చు.