పాదాలపై పగుళ్ల సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ చిట్కాలు పాటించండి?

శీతాకాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. చర్మం పొడి వారి మృత కణాల సంఖ్య పెరిగిపోయి చర్మంపై మరియు అరికాళ్ళు పాదాలపై పగుళ్లు ఏర్పడి తీవ్రమైన నొప్పితో బాధపడాల్సి వస్తుంది. అయితే చాలామంది చర్మ సమస్యలను తగ్గించుకోవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. పాదాలపై ఏర్పడిన పగుళ్ల గురించి ఎక్కువగా ఆలోచించరు.పాదాలపై ఏర్పడిన పగుళ్ళ గుండా హానికర సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించి సైల్యూలైటిస్ అనే ఇన్ఫెక్షన్‌కు దారి తీయవచ్చు దాని ఫలితంగా పాదాల్లో నీరు చేరి వాపు వస్తుంది. నడవడానికి ఎంతో కష్టంగా మారుతుంది. ఈ ఇన్ఫెక్షన్ ఒక్కొక్కసారి సర్జరీ చేయించుకోవడం వరకు వెళ్లొచ్చు.

అందుకే పాదాలపై ఏర్పడిన పగుళ్లను నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ కు కారణమై తీవ్రమైన నొప్పినీ భరించాల్సి వస్తుంది. పాదాలపై పగుళ్ల సమస్యతో బాధపడేవారు గోరువెచ్చని కొబ్బరి నూనెను లేదా ఆలివ్ నూనెను అరికాళ్ళపై మసాజ్ చేసుకుంటే వీటిలో ఉండే సహజ
యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు హానికర సూక్ష్మజీవులను నశింపజేసి ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. అలాగే చర్మానికి తగినంత తేమను ఉంచి పొడి బారనివ్వకుండా ఉంచడంతోపాటు పగుళ్ల సమస్యను అరికడుతుంది.

ముఖ్యంగా శీతాకాలంలో చర్మాన్ని డీహైడ్రేషన్ సమస్య నుంచి కాపాడడానికి న్యాచురల్ మాయిశ్చరైజర్ లను ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారకుండా, పాదాల పగుళ్లు ఏర్పడకుండా జాగ్రత్త పడవచ్చు. పాదాలపై పగుళ్లు ఏర్పడినప్పుడు కాటన్ సాక్స్ ధరించడం వల్ల హానికర సూక్ష్మజీవులు మన శరీరంలో ప్రవేశించడాన్ని కొంతవరకు ఆపవచ్చు. పాదాలపై పగుళ్లు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం షాంపూ కలిపి 20 నిమిషాల పాటు పాదాలను మంచి తర్వాత శుభ్రం చేసుకుంటే పగుళ్లలో పేరుకుపోయిన దుమ్ము దూళి హానికర సూక్ష్మజీవులు తొలగిపోతాయి.