ప్రస్తుతం ఈ శీతాకాలంలో తరచూ అనారోగ్య సమస్యలు తలెత్తడమే కాకుండా అనేక చర్మ సంబంధిత వ్యాధులు కూడా తలెత్తుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈజీగా కాలంలో చర్మం పొడిబారటం, కాళ్లు చేతులు పగలటం వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ పాదాల పగుళ్ల సమస్య చూడటానికి చిన్నదిగానే అనిపించినా కూడా దానిని నిర్లక్ష్యం చేస్తే ఆ సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఇలా పాదాలు పగలటం వల్ల పాదాలు చాలా అందవిహీనంగా కనిపిస్తాయి. అందువల్ల పాదాల పగుళ్ల సమస్యతో చాలామంది సతమతమవుతూ ఉంటారు. అయితే ఇలా పాదాల పగుళ్ల సమస్యతో బాధపడేవారు ఈ చిట్కాను రెండు రోజులు పాటిస్తే చాలు మృదువైన పాదాలు మీ సొంతం.
పాదాల పగుళ్ల సమస్యను దూరం చేసే చక్కటి చిట్కా :
ముందుగా రెండు నిమ్మ పండ్లు తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి. వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్, వన్ టేబుల్ స్పూన్ పసుపు, కట్ చేసి పెట్టుకున్న నిమ్మ పండు ముక్కలు వేసి పదిహేను నిమిషాల పాటు నీటిని బాగా మరిగించాలి. ఇలా నిమ్మ పండు ముక్కలు వేసి మరిగించిన వాటర్ ను ఒక టబ్ లో పోసి ఆ నీరు గోరువెచ్చగా ఉండేలా అందులో చల్లటి నీళ్లు కలపాలి.
ఆ గోరువెచ్చని నీటిలో వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, వన్ టేబుల్ స్పూన్ రెగ్యులర్ షాంపూ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ లో మీ పాదాలను కనీసం ఇరవై నిమిషాల పాటు ఉంచి స్క్రబ్బింగ్ చేసుకోవాలి. ఆపై నార్మల్ వాటర్ తో శుభ్రంగా పాదాలను క్లీన్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక చిన్న బౌల్ ను తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ వాసెలిన్, రెండు టేబుల్ స్పూన్లు గోరువెచ్చని కొబ్బరి నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి వేళ్ళతో స్మూత్ గా పది నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. ఇలా రెండు రోజుల పాటు క్రమం తప్పకుండా చేయటం వల్ల పాదాల పగుళ్ళ సమస్య దూరం అవ్వడమే కాకుండా పాదాలు మృదువుగా తయారు అవుతాయి.