మొటిమల సమస్యలు వేధిస్తున్నాయా… ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ఈ చిట్కాలు ప్రయత్నించండి!

అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు అయితే కొందరు అందం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ వారి మొహం పై మొటిమల సమస్యలు వారిని వేధిస్తూ ఉంటాయి. ఈ విధంగా మొహం మీద వచ్చే మొటిమల వల్ల ముఖం అందంగా కనిపించదనే బాధలో చాలామంది ఉంటారు. అయితే మొటిమలు రావడం అనేది మన శరీరంలో జరిగే మార్పుల వల్ల జరుగుతుంది. శరీరంలో ఏర్పడే హార్మోన్ల ఎఫెక్ట్ వల్ల మొటిమలు వస్తాయి. అయితే మొటిమలు అధికంగా ఉంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కానీ చాలామంది అసలు మొటిమలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలని రకరకాల సలహాల గురించి వెతుకుతూ ఉంటారు. మరి ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే ఇలా ప్రయత్నించి చూడండి.

నేటి కాలంలో ప్రతి ఒక్కరు మొబైల్ ని వాడుతున్నారు. మనం ఫోన్లు మాట్లాడేటప్పుడు వాటిని మన ముఖానికి దగ్గరగా పెట్టుకొని, ఓ రకంగా వాటిని మన చెంపలకు తాకేలా పెట్టుకొని మాట్లాడుతుంటాం. దీని వల్ల ఫోన్ కు ఉన్న బ్యాక్టీరియా మన ముఖం మీదకు చేరి, మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఫోన్ మాట్లాడేటప్పుడు చాలామందికి చమట వస్తుంటుంది. ఇలాంటి సమస్య నుంచి బయటపడాలంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడటం ఎంతో మంచిది.

ఇక మొటిమల నివారణకు చర్మాన్ని అప్పుడప్పుడు స్క్రబ్ చేయాలని నిపుణులు సలహా ఇస్తారు ఇలా చేయడం వల్ల చర్మంలో ఉన్న మృత కణాలు తొలగిపోతాయి. అయితే స్క్రబ్ చేయడానికి మార్కెట్లో ఉన్నటువంటి ఫేస్ ప్రోడక్ట్లు కాకుండా ఇంట్లోనే శనగపిండి బియ్యం పిండి వంటి వాటిని ఉపయోగించి వాటిలోకి కాస్త పెరుగు జోడించి బాగా స్క్రబ్ చేయడం వల్ల కూడా మృత కణాలు తొలగిపోయి చర్మంపై మొటిమలు మచ్చలు లేకుండా ఎంతో కాంతివంతంగా తయారవుతుంది. ఇక ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా వారి కంటూ ప్రత్యేకమైన టవల్ సోప్ ఉపయోగించడం వల్ల కూడా ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.