ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్లు ఉపయోగించే వారి సంఖ్య రోజుకి పెరుగుతుం ఇంటర్నెట్ తప్పనిసరిగా ఉండాలిది. చిన్నపిల్లల నుండి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ చేతిలో లేనిది జీవితం గడవదు అన్నట్లుగా పరిస్థితి తయారయింది. కొంతమంది రెండు రెండు స్మార్ట్ ఫోన్లు కూడా ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ఇంట్లో కూర్చొని షాపింగ్ దగ్గర నుండి బిల్లులు పే చేసే వరకు ఇంట్లో కూర్చుని స్మార్ట్ ఫోన్ ద్వారా అన్ని పనులు చక్కబెట్టవచ్చు. అయితే స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ పనులు చేయాలంటే ఇంటర్నెట్ తప్పనిసరిగా ఉండాలి. ఇంటర్నెట్ సేవలు కూడా అందరికీ అందుబాటులోకి రావడంతో ఇంటర్నెట్ వాడకం కూడా రోజురోజుకీ పెరుగుతోంది.
ఇంటర్నెట్ కనెక్షన్ ప్రస్తుతం ప్రజలందరికీ తప్పనిసరిగా మారిపోయింది. అయితే ప్రస్తుతం పై జి ఇంటర్నెట్ స్పీడ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉండటం వల్ల చాలామందికి ఇబ్బందిగా అనిపిస్తుంది. హాయ్ స్పీడ్ ఇంటర్నెట్ కోసం అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి మరి రీఛార్జ్ చేసుకుంటున్నప్పటికీ ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉంటుంది. అసలు ఫోన్‌లో ఇంటర్నెట్ స్పీడ్ ఎందుకు తగ్గుతుంది?..ఎలా స్పీడ్ ను పెంచాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం.
• మీ మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ స్పీడ్ స్లోగా ఉంటే మొదటగా యాక్సెస్ పాయింట్ నెట్‌వర్క్ సెట్టింగ్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. దీనికోసం నెట్‌వర్క్ సెట్టింగ్స్‌లో ఏపీఎన్‌లోకి వెళ్లి డీఫాల్ట్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
• అంతే కాకుండా మనం చేసే మరొక పొరపాటు వల్ల కూడా ఇంటర్నెట్ స్పీడ్ తగ్గుతుంది. సోషల్ మీడియా యాప్స్ లో మనం ఆటో ప్లే మోడ్ ఆన్ లో ఉంచినప్పుడు మీరు యాప్‌ను ఓపెన్ చేయకపోయినా అందులోని వీడియోలకు నెట్ ఉపయోగించుకుంటూనే ఉంటాయి. అందువల్ల ఆటో ప్లే వీడియో మోడ్‌ను ఆఫ్ చేసుకోవాలి.
• అంతే కాకుండా ఇంటర్ నెట్ స్పీడ్ పెంచుకోవడానికి మీ మొబైల్ లో బ్రౌజర్‌లో డేటా సేవ్ మోడ్‌ను సెట్ చేయాలి. ఇలా చెయ్యడం వల్ల మీ మొబైల్ లో నెట్ స్పీడ్ పెరుగుతుంది.