ప్రస్తుత కాలంలో అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఉపయోగించుకొని చాలామంది ఎంత సునాయసంగా కష్టపడకుండా రోజువారి అవసరాలను తీర్చుకుంటున్నారు. అలాగే ఈ ఉరుకుల పరుగుల జీవితంతో పాటు పరుగులు పెడుతూ మనం తీసుకునే ఆహారాన్ని కూడా సరైన విధంగా తయారు చేసుకోవడానికి సమయం లేకుండా పోయింది. ముఖ్యంగా మనం ప్రతిరోజు తీసుకునే ఆహార విషయంలో చాలామంది పెద్ద పొరపాట్లు చేస్తున్నారు. ఎక్కువగా అన్నం వండడానికి చాలామంది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లను ఉపయోగిస్తున్నారు. ఇలా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లలో ఆహారం తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతాయని నిపుణులు చెబుతున్నారు.
మనం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఆధారంగా అల్యూమినియం గిన్నెలో ఆహారాన్ని అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికించి తయారు చేస్తాము అయితే ఇలా వేడి కారణంగా అల్యూమినియం గిన్నెలో నుంచి కొన్ని విషవాయువులు వెలువడి మనం తీసుకునే ఆహారంలో కలుస్తాయి. తద్వారా మనం తీసుకునే ఆహారం కూడా విషతుల్యం అవుతుంది.ఇలా ఎలక్ట్రిక్ కుక్కర్ ద్వారా తయారు చేసుకున్న ఈ ఆహారం ఏళ్లకు తరబడి తినడం వల్ల మనలో దీర్ఘకాలిక సమస్యలు వెంటాడుతాయని చెప్పవచ్చు.
ముఖ్యంగా జీర్ణక్రియ సంబంధిత వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. గుండెకు సంబంధించిన సమస్య మొదలుకుని, కీళ్ళవాతం, కాలేయ సంబంధిత సమస్యలు, అధిక శరీర బరువు పెరిగిపోవడం వంటి పలు అనారోగ్య సమస్యలకు ఖచ్చితంగా కరెంట్ కుక్కర్ లో వండినఆహార పదార్థాలు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు అందుకే వీలైనంత వరకు కరెంటు కుక్కర్లో ఆహారం తయారు చేసుకొని తినడం పూర్తిగా దూరం పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.