ఈ రోజుల్లో చాలామంది ప్రధానంగా ఎదుర్కొనే సమస్య శరీర బరువు నియంత్రణలో లేకపోవడం కారణాలు ఏవైనాప్పటికీ శరీర బరువు నియంత్రణ కోల్పోతే డయాబెటిస్ ఉబకాయం గుండెపోటు రక్తపోటు వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడానికి మన వంటింట్లో సహజ సిద్ధంగా దొరికే కొన్ని ఔషధ మూలికల ద్వారా శరీర బరువు తగ్గించుకోవచ్చు.వంటకాల్లో రుచికి వాడే దాల్చిన చెక్క బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.ఇందులో ఉండే యాంటీ పరాసిటిక్ లక్షణాలు కొవ్వును కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.దాల్చిన చెక్క నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనెను కలుపుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది.
జిలకర ను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే జిలకర నీటినీ ప్రతిరోజు సేవిస్తే ఇవి బరువు తగ్గించే ఎంజైములను ఉత్తేజపరిచి అతిబరు సమస్యకు పరిష్కారం చూపుతాయి. అలాగే నిమ్మరసంలో తేనె కలుపుకొని పరగడుపున సేవించిన మంచి ఫలితం ఉంటుంది.మన ఇంటిలో తప్పకుండా ఉండే ధనియాలు శరీర బరువును తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ప్రతిరోజు ధనియాలతో కషాయాన్ని తయారు చేసుకుని సేవిస్తే ఇందులో ఉండే పాలీఫినాల్స్ అనే ఔషధ గుణం కొవ్వులతో పోరాడడంలో మరియు వాటి డిపాజిషన్ నివారించడంలో సహాయపడుతుంది. తద్వారా శరీర బరువును సునాయాసంగా తగ్గించుకోవచ్చు.
బరువు తగ్గడానికి యాపిల్ సైడర్ వెనిగర్ మంచి ఫలితాలను ఇస్తుందని కొన్ని పరిశోధనలు తేలింది.
10 ఎంఎల్ యాపిల్ సైడర్ వెనిగర్ 200 మి.లీ నీటిలో
కలుపుకొని ప్రతిరోజు ఉదయం అల్పాహారానికి ముందు సేవిస్తే బొడ్డు చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.మెంతి గింజలను నానబెట్టి తర్వాత రోజు ఆ నీటిలో కొద్దిగా తేనె కలుపుకొని సేవిస్తే ఇందులో ఉండే సపోనిన్‌లు, ఫైబర్ లక్షణాలు బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ పానీయాలను సేవిస్తూనే కొంత శారీరక శ్రమ కలిగిన వ్యాయామం నడక యోగా వంటివి అలవాటు చేసుకుంటే మంచిది.