డ్రై ఫ్రూట్స్ అనగానే చాలామందికి బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్,వాల్ నట్స్ వంటివి ఎక్కువగా గుర్తొస్తుంటాయి. వీటిల్లో కూడా మన ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అయితే మెదడు ఆరోగ్యాన్ని రక్షించే విషయంలో మాత్రం వాల్ నట్స్ మించినది ఏదీ లేదని న్యూట్రిషన్ వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వాల్ నట్స్ లో అన్ని డ్రై ఫ్రూట్స్ లో లభించే విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా లభించడంతో పాటు సమృద్ధిగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, పాలీఫెనొలిక్ సమ్మేళనాలు,వై-టోకోఫెరోల్, యాంటీ క్యాన్సర్ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ మొత్తంలో లభ్యమవుతున్నాయి.
వాల్ నట్స్ ప్రతిరోజు నానబెట్టుకుని తినడం వల్ల ఇందులో ఉండే పాలీఫెనొలిక్ సమ్మేళనాలు,ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు,యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మెదడును ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించి మెదడు కండరాలను, నాడులను దృఢంగా ఉంచి మెదడు చురుకుదనాన్ని ,జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అలాగే
వాల్‌నట్స్‌లో ట్రిప్టోఫాన్ కూడా పుష్కలంగా ఉండీ
మెదడులో హ్యపీ హార్మోన్లు విడుదల చేసేలా ప్రేరేపించి మిమ్మల్ని మానసిక ఒత్తిడి, డిప్రెషన్ సమస్యల నుంచి బయటపడేస్తుంది.
అతి బరువు సమస్యతో బాధపడే వారు నానబెట్టుకున్న వాల్ నట్స్ ఎక్కువగా తింటే వీటిలో క్యాలరీలు తక్కువగా ఉండి శరీర బరువును సహజ పద్ధతులు తగ్గించుకోవచ్చు. తద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను, రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.వాల్ నట్స్ లో వై-టోకోఫెరోల్,విటమిన్ ఇ లభ్యమవుతాయి కావున చర్మ సమస్యలను,చర్మ క్యాన్సర్లను నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు కొన్ని వాల్ నట్స్ ఆహారంగా తీసుకుంటే ఇందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గించి గుండెపోటు ముప్పును తగ్గిస్తుంది.