‘యన్‌.టి.ఆర్‌’:బాలయ్య పాత్రను డూప్ తో లాగేసారా? !

తెలుగువారి అభిమాన నటుడు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘యన్‌.టి.ఆర్‌’.బాలకృష్ణ నిర్మిస్తూ… ఇందులో టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్బీకే ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాను వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి.

కాగా అలనాటి సాంకేతిక నిపుణులు మరియు నటీనటుల పాత్రలు ఉన్న ఈ బయోపిక్ లో.. ఆ పాత్రల స్థాయికి తగట్లుగానే ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తోంది. బయోపిక్ లోని పాత్రల్లో.. ఏఏ నటీనటులు, ఏఏ పాత్రల్లో నటిస్తున్నారో మొత్తం లిస్టు బయటికి వచ్చేసింది.

స్వర్గీయ ఎన్టీఆర్ నట, రాజకీయ జీవితంలో కీలక పాత్ర ఎవరైతే పోషించారో అందరిపై క్లారిటీ వచ్చేసింది. అయితే అసలైన ఎన్టీఆర్ నట వారసుడు బాలకృష్ణ పాత్ర విషయం మాత్రం పెద్ద సస్పెన్స్ గా మిగిలిపోయింది. యాక్టర్స్ ని రివీల్ చేసిన లిస్ట్ లోనూ, వీడియోలో కూడా ఆ పేరు లేదు. మరి ఎవరు చేసి ఉంటారు ఆ పాత్ర …అంటే రెండు సమాధానాలు వస్తున్నాయి.

ఒకటితై… బాలకృష్ణ పాత్ర బాలకృష్ణే చేసారట. అంటే ద్విపాత్రాభినయం చేసాడన్నమాట. మరి రెండో ఆన్సర్ ఏమిటంటే… బాలయ్య పాత్రను డైరక్ట్ గా చూపకుండా..కేవలం లాంగ్ షాట్స్, బ్యాక్ యాంగిల్స్ లో మాత్రమే ఓ మూడు సీన్స్ లో చూపించి బాలయ్య డూప్ తో లాగేసారంటున్నారు. ఇందులో ఏది నిజం అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ దాకా ఆగాల్సిందే.

రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 9న ‘కథానాయకుడు’ పేరుతో విడుదల కానుంది. ఎన్టీఆర్‌ సినీ కెరీర్‌ ప్రారంభం నుంచి ముఖ్యమంత్రి అయ్యే వరకూ జరిగిన సంఘటనలకు దీనిలో దృశ్యరూపం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక సీఎం అయిన దగ్గరి నుంచి ఆయన మరణించే వరకూ చోటు చేసుకున్న సంఘటనలను ‘మహానాయకుడు’ పేరుతో పిబ్రవరి 7 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఎన్‌బీకే ఫిల్మ్స్‌ పతాకంపై నందమూరి బాలకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వారాహి చలన చిత్రం, విబ్రి మీడియాలు సమర్పిస్తున్నాయి. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.