స్టార్ కపుల్ స్టార్ జంటలు డేటింగ్స్ అలాగే ప్రేమలు ఇవన్నీ అన్ని సినీ ఇండస్ట్రీ లలో కూడా కామన్ గానే వినిపిస్తూ ఉంటాయి. అలాగే మన దగ్గర కూడా ఎంతో మంది స్టార్ హీరోలు హీరోయిన్ లు డేటింగ్ లు చేసిన వారూ ఉన్నారు పెళ్లి చేసుకొని ఇప్పటికీ ఆనందంగా అలాగే విడిపోయిన వారు కూడా ఉన్నారు.
అయితే మరి లేటెస్ట్ గా ఈ లిస్ట్ లోకి మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ పేరు కూడా చేరింది. మన టాలీవుడ్ యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ లావణ్య త్రిపాఠి ఇద్దరు కూడా డేటింగ్ లో ఉన్నారని ప్రేమించుకుంటున్నారు, ఇంట్లో కూడా తెలుసు పెళ్లి వరకు కూడా వెళ్లారని పలు గాసిప్స్ బాగా వినిపించాయి.
అలాగే అప్పుడు ఇద్దరి మధ్య పరిస్థితులు కూడా కాస్త అలాగే కనిపించాయి. అయితే ఇప్పుడు ఈ గాసిప్స్ పై మాత్రం లేటెస్ట్ గా లావణ్య త్రిపాఠి ఓ క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఓ నేషనల్ సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ…
తాను ఎవరితోనో డేటింగ్ లో గాని ప్రేమలో గాని లేనని వరుణ్ తేజ్ తనపై వస్తున్న వార్తలు కూడా పూర్తి అవాస్తవం అని ఇలాంటి గాసిప్స్ అన్నీ మీడియా నుంచే స్టార్ట్ అయ్యాయని ఆమె తోసిపుచ్చింది.. అయితే రీసెంట్ గా లావణ్య త్రిపాఠి నటించిన “హ్యాపీ బర్త్ డే” ప్లాప్ గా నిలవగా దీని తర్వాత పలు ప్రాజెక్ట్ లు చేస్తూ బిజీగా ఉంది.