తాట తీసే పోగ్రాం పెట్టుకున్న తాప్సీ..ఏమైపోతారో

తీద్దామనుకున్న సినిమాకు ఒక హీరోని కానీ హీరోయిన్ ని కానీ ఫైనలైజ్ చేసాక రకరకాల కారణాలతో వాళ్లు తప్పుకుంటే వేరేవాళ్లని తీసుకురావటం కామన్. అయితే అందుకు ముందువాళ్లు ఎందుకు తప్పుకున్నారనేది ఎప్పుడూ ఆ ప్లేస్ లోకి వచ్చేవాళ్లకి క్వ చ్చినే. ఇప్పుడు తాప్సీ అదే ప్రశ్న వేస్తోందిట. తమన్నా ఎందుకు తప్పుకుందో కారణం తెలిస్తే తన ఎంట్రీకు ఏ ప్లాబ్లం లేదని చెప్పిందిట. ఇంతకీ ఏ సినిమా గురించి ఈ డిస్కషన్ అంటారా..

ప్రముఖ యాంకర్‌, దర్శకుడు ఓంకార్‌ తెరకెక్కించిన ‘రాజుగారి గది’ చిత్రం మంచి సక్సెస్ అయ్యింది. ఆ ఉత్సాహంతోనే ‘రాజుగారి గది 2’ తీశారు. ఇప్పుడు మూడో భాగం కూడా మొదలైపోయింది. ఇందులో తమన్నాను హీరోయిన్ గా ఎంపికచేసుకున్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు మొదలైన కొద్దిరోజుల్లోనే తమన్నా సినిమా నుంచి తప్పుకొన్నారని తెలిసింది. దాంతో ఆమె స్థానంలో ఓంకార్‌.. నటి తాప్సిని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారట. మేరకు ఆమెను సంప్రదించారట. అయితే ఆమె ఇప్పుడు తమన్నా ఎందుకు తప్పుకుంది అని అడుగుతోందిట. దానికి నిర్మాతలు ఆమె హిందీలో ‘బోలే చూడియా’ అనే సినిమాకు సంతకం చేయడంతో డేట్లు కుదరక ఈ సినిమా నుంచి తప్పుకొన్నట్లు చెప్పారట. తాప్సీ ఆ విషయం ఖరారు చేసుకున్నాకే ఈ ప్రాజెక్టులోకి వస్తాను అని చెప్పిందని సమాచారం.

‘గేమ్‌ ఓవర్’, ‘బద్లా’, ‘ఆనందో బ్రహ్మ’ వంటి క్రైమ్‌ థ్రిల్లర్‌, హారర్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాల్లో తాప్సి నటించిన సంగతి తెలిసిందే. తమ కథ కూడా అలాంటి జానర్ సినిమానే కాబట్టి ఆమె సరిగ్గా సరిపోతారని భావించిన ఓంకార్‌..‘రాజుగారి గది 3’లో తాప్సిని ఎంపికచేసుకోవాలని చెప్తన్నారు.