‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’:అలియాభట్ రెమ్యునేషన్ తెలిస్తే షాకే

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’సినిమాలో హీరోయిన్స్ ఎవరనే విషయం కొద్ది కాలం పాటు హాట్‌ టాపిక్‌గా నడిచిన సంగతి తెలిసిందే. అనేక మంది బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లు బయటికి వచ్చాయి. చివరకు బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ ఈ సినిమాలో ఫైనల్ చేసామని రాజమౌళి అఫీషియల్ గా ప్రకటించారు.ఆమె ఎంతో గౌరవించే నిర్మాత కరణ్‌ జోహార్‌ ద్వారా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ టీమ్ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఆమె ఎంత పారితోషికాన్ని అందుకోనుందనేది ఇంట్రస్టింగ్ చర్చగా మారింది.

‘రాజీ’ సినిమా హిట్ తరువాత అలియా భట్ తన రెమ్యునేషన్ ని 10 కోట్లకి పెంచింది. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లోను ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా భారీస్థాయిలో విడుదల కానుంది గనుక, పారితోషికంగా ఆమె 15 కోట్లను డిమాండ్ చేసినట్టుగా సమాచారం. ఆ తరువాత జరిగిన బేరసారాల కారణంగా ఆమెకి 12 కోట్లకు ఫైనలైజ్ చేసినట్లు చెప్పుకుంటున్నారు.

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ‘బాహుబలి’ తర్వాత జక్కన్న తీస్తున్న సినిమా కావడంతో చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. 2020 జూలై 30వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.