డైరక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. ఈ చిత్రంపై అంచనాలయితే బాగా వున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రేమకథా చిత్రంలో హీరోయిన్ ఒక యాక్సిడెంట్ తర్వాత గతం మరచిపోయి, ప్రియుడు గుర్తు లేకపోతే ఆమెని మళ్లీ ఆమె ఎలా గెలుచుకుంటాడు అనే కథ అంటున్నారు.
దాదాపు కొంచెం అటూ ఇటూలో ఇదే లైన్‌తో ఈ యేడాదిలోనే ‘తేజ్ ఐ లవ్యూ’ చిత్రం వచ్చింది. సాయి ధరమ్ తేజ్, అనుపమతో కరుణాకరన్ తీసిన ఆ సినిమా సక్సెస్ కాలేదు. అయితే మరి దర్శకుడు హను రాఘవ మ్యాజిక్ ఈ సినిమాకు ప్లస్ అవుతుందని అంటున్నారు.
ఈ సినిమా క్లైమాక్స్ సీన్స్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతాయట. అప్పటి వరకూ ప్రేమకథలా సాగుతున్న ఈ సినిమాలో ఓ ట్విస్టు ఏకంగా సినిమా స్వరూపాన్నే మార్చబోతోందని వినికిడి. గత చిత్రం ‘లై’తో ఎదురుదెబ్బ తిన్న హను రాఘవపూడిలో మళ్లీ ఫామ్‌లోకి వస్తాననే ధీమా కనిపిస్తోంది.
సుధాకర్ చెరుకూరి నిర్మాణ సారధ్యంలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. జనాల్లో శర్వానంద్, సాయి పల్లవిలకు ఉన్న క్రేజ్ తో సినిమా పై అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీనికి తోడు ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర లిరికల్ సాంగ్స్ విశేషంగా ఆకట్టుకోవడంతో.. ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. సినిమాను డిసెంబరు 21న రిలీజ్ చేస్తున్నారు.