అల్లూరి సీతారామ రాజు, కొమురం భీమ్.. ఇద్దరు స్వాతంత్ర సమరయోధుల జీవిత కథలను స్ఫూర్తిగా తీసుకొని ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న హిస్టారికల్ ఫిక్షన్ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. రామ్‌చరణ్ ని సీతారామ రాజుగా.. ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా చూపించచబోతున్నారు. వీరికి జోడీగా అలియా భట్, ఇంకా ఎంపిక కాని హీరోయిన్ నటిస్తున్నారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్, తమిళ నటుడు సముద్ర ఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాలో తమిళ నటుడు సముద్రఖని చేయబోతున్న పాత్ర గురించి ఒక వార్త బయటకు వచ్చి హల్ చల్ చేస్తోంది. సముద్రఖని ఈ సినిమాలో ఎన్టీఆర్ బాబాయ్ పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ లో అంటే కొమరం భీమ్ పాత్రలో స్వాతంత్య్ర కాంక్షను తీసుకువచ్చిన పాత్ర లో సముద్రఖని కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జూలైలో విడుదల కానుంది.