ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం డైరక్ట్ చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షూటింగ్‌కు వారం రోజుల పాటు విరామం ప్రకటించి రాజమౌళి అమెరికా వెళ్లారు. రాజమౌళి ఇపుడు అమెరికాలో అదీ కూడా వాషింగ్టన్ డీసీ నగరంలో ఉన్నారు. దాంతో త్వరలో జరుగనున్న తానా సభలకు హాజరయ్యేందుకే రాజమౌళి అమెరికా వెళ్లారని కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై రాజమౌళి తాజాగా ట్విటర్ ద్వారా ఖండించారు.
అయితే అదే సమయంలో అసలు రాజమౌళి హఠాత్తుగా ఎందుకు అమెరికా వెళ్లారనే డౌట్ వచ్చింది. అయితే మీడియా వర్గాల నుంచి తెలిసిన సమాచారం ప్రకారం రాజమౌళి వాషింగ్టన్‌కి వెళ్లిన కారణం వేరు. తానా సభల్లో మ్యూజికల్ షో నిర్వహిస్తున్నారు ఎం.ఎం.కీరవాణి. ఆయన తానాలో కచేరి కోసం వాషింగ్టన్ వెళ్లడంతో..రాజమౌళి, ఇతర కుటుంబ సభ్యులంతాకలిసి అమెరికా వెళ్లారు.
ఎందుకంటే జులై 4న..కీరవాణి బర్త్‌డే. కీరవాణి పుట్టినరోజు నాడు వారు కుటుంబ సభ్యులంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సారి హైదరాబాద్‌లో కీరవాణి లేకపోవడంతో..నాలుగో తేదీనాడు అమెరికాలో ఉండేలా రాజమౌళి, వారి ఫ్యామిలీ మెంబర్స్ ప్లాన్ చేసుకున్నారట. అదీ అసలు కారణం అని తెలిసింది.