అది జగన్ కు వర్మ పుట్టిన రోజు గిప్ట్?

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అందులో నానా అర్దాలు, గూడార్దాలు ఉంటాయి. ఆయన ఒక్క ట్వీట్ వేస్తే వంద అర్దాలు గోచరిస్తాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. వర్మ తన దర్శకత్వంలో రూపొందుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ నుంచి వెన్నుపోటు సాంగ్ ఒకటి రిలీజ్ చేయటానికి ప్లాన్ చేసారు. అయితే అందులో వింతా లేదు…విశేషమూ లేదు. అయితే ఆయన ఎంచుకున్న రోజు ఇప్పుడు అనేక మందిని ఆలోచనలో పడేసింది. అదే డిసెంబర్ 21.

డిసెంబర్ 21 వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు. ఆ రోజున వెన్నుపోటు సాంగ్ ని విడుదల చేయటం..ఆ వర్గానికి సపోర్ట్ ఇచ్చినట్లే, జగన్ కు గిప్ట్ ఇచ్చినట్లే అని సోషల్ మీడియాలో ఓ వర్గం అంటోంది. అయితే మరో వర్గం…వర్మ కావాలని ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ కు కౌంటర్ ఇవ్వటానికి వెన్నుపోటు పాటను విడుదల చేస్తున్నాడంటున్నారు. ఇలా ఎవరికి తోచినట్లు వారు అర్దం చేసుకునేలా వర్మ ట్వీట్ వేసి వివాదం సృష్టించారు.

ఇక లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం విషయానికి వస్తే… ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు వర్మ. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాలో వెన్నుపోటు పాటకు ప్రత్యేకంగా ఫస్ట్‌లుక్‌ను డిసెంబర్‌ 21 సాయంత్రం రిలీజ్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు వర్మ.