ఈ రోజు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా చర్చించబడుతున్న టాపిక్ ఇదే. తెలంగాణకు చెందిన దిల్‌రాజుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక పదవి వ్వడానికి సిద్ధమయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం. దిల్ రాజుకు పదవి రావడం వెనుక వైసీపీ తరఫున పోటీచేసి ఓడిన ఓ ఎంపీ అభ్యర్థి ఉన్నారని చెప్తున్నారు. ఇంతకీ దిల్‌రాజుకు జగన్ ఇచ్చే కీలక పదవి ఏమిటీ అంటారా.. అలాగే ఆయనకు పదవి ఇవ్వాలని ప్రపోజల్ చేసిందెవరో చూద్దాం.
ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వరస సినిమాలతో తెలుగు పరిశ్రమను ఏలుతున్న నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు అలియాస్ వి. వెంకట రమణారెడ్డి. ఆయన తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తుడు. దాంతో టీటీడీ పాలకమండలిలో సభ్యుడిగా అవకాశం ఇవ్వాలని జగన్ నిర్ణయించారని టాక్. ఇంతకీ ఎవరు ఈ ప్రపోజల్ పెట్టారనేగా మీ డౌట్.
మొన్న జరిగిన 2019 ఎన్నికల్లో విజయవాడ నుంచి వైసీపీ ఎంపీగా పోటీచేసిన ప్రముఖ నిర్మాత పీవీపీ అత్యల్ప ఓట్లతో ఓడిపోయారు. ఆయనకు వైఎస్ జగన్‌తో మంచి సంబంధాలున్నాయి. దాంతో తన మిత్రుడు దిల్ రాజుకు మండలిలో సభ్యుడిగా ఇచ్చి, వెంకన్నకు సేవ చేసుకునే అవకాసం ఇవ్వాలని జగన్‌ను పీవీపీ చిరు కోరిక కోరారట. దానికి వైయస్ జగన్ వెంటనే ఓకే చేసేసారట. అయితే ఇందులో నిజా నిజాలేంటనేది అఫీషియల్ గా ప్రకటన వస్తే కానీ తెలియదు.