‘సాహో’ లేటుకి ఆ ఒక్క సీన్ కారణమా ?
ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. ఈ సినిమా ఆగష్టు 15న విడుదలవుకావాల్సి ఉండగా లాస్ట్ మినిట్ లో వాయిదా పడింది. అందుకు రకరకాల కారణాలు మీడియాలో వినపడుతున్నాయి.పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తికాలేదు. సమయం తక్కువగా ఉందని హడావుడిగా పనులు చేస్తే అవుట్ ఫుట్ సక్రమంగా ఉండదని భావించిన నిర్మాతలు చిత్రాన్ని వాయిదావేయడమే మంచిదని భావిస్తున్నారని చెప్పారు. అయితే అది అసలు కారణం కాదని ఒక్క సీనే ..సినిమా వాయిదాకి కారణమైందని అంతటా వినపడుతోంది.
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం…సాహో క్లైమాక్స్ లో ఎడారిలో ఓ ఫైట్ ఉందిట. రాక్షసుల్లాంటి విదేశీ ఫైటర్స్ తో ఆ ఫైట్ ఉంది. దాన్ని షూట్ చేసిన తరువాత విజువల్ ఎఫెక్ట్స్ ఎలా కావాలో దర్శకుడు సుజిత్… విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ కు చెప్పగా.. ఫైనల్ గా వచ్చిన సీన్ ను చూసి సుజిత్ షాక్ అయ్యాడట.
అవుట్ పుట్ నాసిరకంగా ఉందని చెప్పి ఛేంజెస్ చెప్పడంతో కనీసం కనీసం పదిరోజుల సమయం పడుతుందని చెప్పారట. ఈ క్లైమాక్స్ ఫైట్ సినిమాకు కీలకం కావడంతో చేసేదిలేక సినిమా రిలీజ్ ను పదిహేను రోజులపాటు వాయిదా వేసుకున్నారు. ఈ న్యూస్ సోషల్ మిడియాలో ట్రెండ్ అవుతోంది. ఎంతవరకూ నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
యూవీ క్రియేషన్స్ సంస్థ 300 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించి నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కేవలం 8 నిముషాల నిడివి గల ఒక్క సన్నివేశం కోసం ఏకంగా 70 కోట్లు వెచ్చించారని చెప్తున్నారు.