చేతులు చూస్తాడనుకుంటే..చేయి తిరిగిన దొంగ అంటున్నారే

‘జిల్‌’చిత్రాన్ని రూపొందించిన రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. విభిన్నమైన ప్రేమకథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లవర్‌బాయ్‌గా ప్రభాస్ పాత్ర కొత్త పంథాలో సాగే ఈ చిత్రం గురించి ఇప్పటికే చాలా రూమర్స్ మీడియాలో ప్రత్యక్ష్యమయ్యాయి. తాజాగా మరో వార్త ఈ సినిమా కథ గురించి మొదలైంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ ఓ దొంగ పాత్రలో కనిపించనున్నారు. అయితే అతను చేసే వ్యాపారం వింటేజ్ కార్లు అమ్మడం, కొనటం.

కానీ నిజానికి అతను కార్లను కొట్టేస్తూంటాడు. తాళం లేకుండా నేర్పుగా డోర్‌ ఓపెన్ చేయడం, యజమానికు తెలియకుండా కార్లను దొంగతనం చేయడం లాంటి పనుల్లో
అతనిది తిరిగిన చేయి. ఈ కార్లను దొంగలించే ప్రయత్నంలోనే హీరోయిన్ పూజాతో ప్రేమలో పడతారట. ఇటలీలో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం 1920ల కాలంలో జరగనుంది. ఇందుకోసం పురాతన కార్లను, సెట్లను డిజైన్ చేసి వాడుతున్నారు.

పూర్తి స్దాయి ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్. కృష్ణంరాజు, వంశీ, ప్రమోద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘సాహో’తో పోలిస్తే రాధాకృష్ణ సినిమా తక్కువ బడ్జెట్లోనే తెరకెక్కుతుందట. ఆ చిత్రాన్ని కూడా తెలుగు-తమిళం-హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారు. ‘సాహో’తో పాటు ఈ చిత్రం కూడా వచ్చే ఏడాదే కొన్ని నెలల వ్యవధిలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: మది, సంగీతం: అమిత్‌ త్రివేది.