బాబాయ్ ‘బిగ్ బాస్’ షో….భయపడుతున్న ప్రభాస్?

తెలుగు టెలివిజన్ చరిత్రలో అతిపెద్ద రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న ‘బిగ్ బాస్’ మూడవ సీజన్ జూలై 21 నుంచి ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఇప్పటికే రెండు సీజన్ లు పూర్తయింది. తొలి సీజన్ లో ఎన్టీఆర్, రెండో సీజన్ లో నాని హోస్ట్ గా వ్యవహరించగా, మూడో సీజన్ లో నాగార్జున హోస్ట్ గా ఉంటారని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ నేపధ్యంలో ప్రభాస్ తన తాజా చిత్రం సాహో ప్రమోషన్ కోసం బిగ్ బాస్ షోలో ప్రవేశించనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు నిర్మాతలు ఏర్పాట్లు చేసారట. అయితే ఈ విషయమై ప్రభాస్ పెద్దగా ఆసక్తి చూపటం లేదని వినికిడి.

ఎందుకంటే బిగ్ బాస్ షోలో ప్రమోట్ చేసిన సినిమాలన్ని భారీగా ప్లాఫ్ అయ్యాయి. లాస్ట్ ఇయిర్ విశ్వరూపం 2, వైఫ్ ఆఫ్ రామ్, నన్ను దోచుకుందువటే, తేజ ఐ లవ్ యు, దేవదాసు ఇలా వరసపెట్టి ప్లాఫ్ లు. అంతకు వచ్చిన బిగ్ బాస్ సీజన్ 1లో ప్రమోట్ చేసిన మేడ మీద అబ్బాయి లాంటి కొన్ని సినిమాలది అదే పరిస్దితి. ఈ నేపధ్యంలో ప్రబాస్ ని ఈ షో లో పాల్గొవద్దని ఫ్యాన్స్ కోరినట్లు తెలుస్తోంది. కానీ నిర్మాతలు ఆల్రెడీ మనం కమిట్మెంట్ ఇచ్చేసాం బాగోదు..వెనక్కి తగ్గితే అంటున్నారట. మరి చూడాలి..సాహోకు ఈ షో ఎంతవరకూ ఉపయోగపడుతుందో.

ఇక ఈ షోలో మొత్తం 16 మంది పోటీదారులు హౌస్ లో ఉంటారని తెలుస్తున్నా, వారు ఎవరన్న విషయం ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. తొలి రెండు భాగాలతో పోలిస్తే, మరింత వినోదాత్మకంగా తాజా సీజన్ ఉంటుందని నిర్వాహకులు అంటున్నారు. బిగ్ బాస్ సెట్ ఎక్కడ ఉందన్న విషయాన్ని సస్పెన్స్ లో ఉంచుతూ, కార్యక్రమంపై మరింత ఆసక్తిని పెంచుతున్నారు. ఇదిలావుండగా, ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్లు వీరేనంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ జాబితా చక్కర్లు కొడుతోంది. బిగ్ బాస్ ప్రారంభ తేదీపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సివుంది.