ప్రభాస్ కు అదే భయం పట్టుకుంది, విసిగించేస్తున్నారు
ప్రభాస్ ఇప్పుడు కేవలం తెలుగు హీరో మాత్రమే కాదు..బాహుబలి పుణ్యమా అని ఆయన నేషనల్ హీరో అయ్యిపోయారు. దాంతో ఆయన కేవలం మన మీడియానే కాక నార్త్ ఇండియా మీడియాని సైతం ఫేస్ చేయాల్సి వస్తోంది. మన మీడియాని అయితే ఏదో విధంగా పీఆర్వోల ద్వారా మ్యానేజ్ చేయచ్చు. కానీ నార్త్ ఇండియా మీడియా మన కంట్రోలులో ఉండదు. అలాగని ప్రభాస్ కు మీడియా అంటే భయమేమీ లేదు..కానీ ఎక్కడకి వెళ్ళినా ఆయన ఎదుర్కొంటున్న ప్రశ్నలు రెండే..ఒకటి స్వీటి అనుష్కతో మీ రిలేషన్ ఏమిటి..పెళ్లెప్పుడు అని.
ఇన్నాళ్లూ మీడియాకు దూరంగా ఉంటూ కేవలం సోషల్ మీడియాలో నే ఉంటూ వచ్చిన ప్రభాస్ తన తాజా చిత్రం సాహో కోసం మీడియా ముందుకు రాక తప్పనిసరి పరిస్దితి. ఇదే సమయంలో ఎలా పుట్టిందో ఏమో కానీ ప్రభాస్‌కి పెళ్లి కళ వచ్చేసింది అంటూ ఓ వార్త మీడియాలో చక్కర్లు కొట్టడం మొదలెట్టింది. అక్కడితో ఆగకుండా అమెరికాలో సెటిలైన ఒక ఎన్నారై కూతురితో ప్రభాస్ పెళ్లి ఫిక్సయిందని రాసేసారు.
ప్రభాస్ పెద నాన్న ..రెబల్ స్టార్ కృష్ణంరాజే ఈ ప్రపోజల్‌ని మూవ్ చేశారని.. ఈ వింటర్లోనే ముహూర్తం కూడా వుండొచ్చని ఒక వార్త నడుస్తోంది. దాంతో ఇప్పుడు సాహో ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకు వస్తే మళ్లీ ప్రభాస్‌ని ఎటాక్ చేసే ప్రశ్న కూడా ఇదే. దేశమంతా మహానగరాల్లో టూర్ ప్లాన్ చేసింది సాహో ప్రమోషన్ యూనిట్. ఇక స్టేజ్ మీదెక్కి మీడియాను ఫేస్ చేయక తప్పని పరిస్థితి ప్రభాస్ది. బాలీవుడ్ మీడియా ఖచ్చితంగా అడిగే ప్రశ్నల్లో ఇదొకటి. పెళ్లి మేటరేంటి డార్లింగ్ అని ఎవ్వరడిగినా.. కోపం తెచ్చుకోకుండా సమాధానం చెప్పాలి. ప్రభాస్ ఏది చెప్పినా అది మళ్లీ మరో న్యూసే. సాహోకి పబ్లిసిటీ కన్నా ప్రభాస్‌ని మాత్రం పెళ్లి మాటర్ ఇబ్బంది పెడుతోంది.