`ఆర్ ఎక్స్ 100` భామ‌ను రిపీట్ చేస్తున్న‌ యువ‌హీరో

(మోహన్)
ఒక హీరో ప‌క్క‌న ఒక సినిమాలో ఐట‌మ్ సాంగ్ చేసిన నాయిక‌కు రెండో సినిమాలో హీరోయిన్‌గా ప్ర‌మోష‌న్ రావ‌చ్చు. ఒక సినిమాలో నాయిక‌గా చేసిన త‌ర్వాత రెండో సినిమాలో కేవ‌లం ఐట‌మ్ సాంగ్ చేసి భారీగా పారితోషికాన్నీ అందుకోవ‌చ్చు. హీరో మ‌న‌సు ప‌డాలేగానీ నాయికకు అవ‌కాశం ఎంత‌సేపు.. అనేది ఇండ‌స్ట్రీలో త‌ర‌చూ వినిపించే మాట‌. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ విష‌యంలోనూ ఇదే నిజం అయ్యేట‌ట్టు క‌నిపిస్తోంది. ఆయ‌న న‌టించిన `సీత‌`లో పాయ‌ల్ రాజ్‌పుత్ ఐట‌మ్ సాంగ్ చేసింది. కాజ‌ల్ అందులో నాయిక‌. పాయ‌ల్ రాజ్‌పుత్ ఎక్స్ ప్రెష‌న్స్, ఆమె యాక్టివ్‌నెస్ న‌చ్చిన బెల్లంకొండ ఆమెను మ‌రో ఆఫ‌ర్ కోసం రెక‌మండ్ చేశాడ‌ట‌.
 
 బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వంశీ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్క‌నుంది. అభిషేక్ అగ‌ర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో నాయిక‌గా పాయ‌ల్ రాజ్‌పుత్‌కి స్పెష‌ల్ ఆఫ‌ర్ ఇచ్చార‌ట‌. ఈ సినిమాలోనూ ఆమె పాత్ర కాస్త `ఆర్ ఎక్స్ 100` త‌ర‌హాలోనే సాగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ట‌. స్టూవ‌ర్ట్ పురం నివాసి టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు క‌థ ఆధారంగా ఈసినిమా రూపొందనుంది. ఇందులో టైగ‌ర్ ప్రేయ‌సిగా పాయ‌ల్ క‌నిపించ‌నుంది. ఆల్రెడీ ఇప్ప‌టికే నాగార్జున‌, వెంక‌టేష్ ప‌క్క‌న పాయ‌ల్ ఛాన్సులు కొట్టేసిన సంగ‌తి తెలిసిందే. ఒక్క హిట్టుతో వ‌రుస ఆఫ‌ర్లు వెంట‌ప‌డ‌తాయంటే ఇదేనేమో మ‌రి.