సినిమా స్టార్స్ బిజినెస్ ఫీల్డ్ లలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తమ సంపాదనను పెట్టుబడిగా పెట్టి రెండు మూడింతలు చేయటంలో నిమగ్నమవుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు మల్టిఫ్లెక్స్ బిజినెస్ లోకి రాగా ..ఎన్టీఆర్ సైతం అదే బిజినెస్ లోకి రావటానికి ఉత్సాహం చూపుతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
అందుతున్న సమాచారం మేరకు ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల్లో మిని మల్టీప్లెక్స్ థియేటర్స్ ని నెలకొల్పడానికి ఎన్టీఆర్ ఇంట్రస్ట్ చూపెడుతున్నారట. ఈ మేరకు కొంతమంది కార్పోరేటర్స్ ఈ మిని మల్టీప్లెక్స్ ప్రాజెక్ట్ తో ఎన్టీఆర్ ని అప్రోచ్ అయ్యారని సమాచారమ్. మంచి వాటాతో ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఎన్టీఆర్ ఆసక్తి కనబరుస్తున్నాడట. ముఖ్యంగా ఎన్టీఆర్ బ్రాండ్ నేమ్ ఈ ప్రాజెక్టులకు కీలకం కానుంది.
అందుకోసం సరైన ప్లేస్ .. అమరావతి అని, అక్కడ మల్టీప్లెక్స్ నిర్మించాలనే ఉద్దేశ్యంలో ఎన్టీఆర్ ఉన్నారని తెలుస్తోంది. ఈ పనిలో ఓ టీమ్ అమరావతిలో మల్టీప్లెక్స్ కోసం ప్లేస్ చూస్తున్నారట. ఇదే కనుక జరిగితే ఎన్టీఆర్ మల్టిప్లెక్స్ లను మనం చూడగలుగుతాం.
ఇదే కనక సక్సెస్ ఫుల్ గా జరిగితే… ఎన్టీఆర్ ..స్టూడియోస్, డిస్ట్రిబ్యూషన్, స్కూల్స్, హోటల్స్, రియల్ ఎస్టేట్.. ఇలా పలు రంగాల్లోకి అడుగుపెట్టాలని ఆలచిస్తున్నారని అంటున్నారు. అంటే అప్పుడు ఫుల్ టైమ్ బిజినెస్ మెన్ గా మారతారన్నమాట.