‘మహానాయకుడు’ : క్రిష్ పీక మీద కత్తి,టెన్షన్ లో టీమ్

భారీ అంచనాల మధ్య… సంక్రాంతి కానుకగా విడుదలైన బాలకృష్ణ – క్రిష్ ల ‘ఎన్టీఆర్ – క‌థానాయ‌కుడు’ చిత్రం డిజాస్టర్ గా మిగిలిన సంగతి తెలిసిందే. మంచి రివ్యూలు, మౌత్ టాక్ వచ్చినా… కలెక్షన్స్ పరంగా కనుమరుగైపోయింది. ఇక సెకండ్ పార్ట్ ‘మహానాయకుడు’లో… పూర్తి రాజకీయ జీవితం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని భావిస్తున్నారు.

క్రిష్ కూడా చాలా సన్నివేశాలను రీ షూట్ చేసారట. అయితే ఈ చిత్రం రిలీజ్ డేట్ విషయమే క్లారిటీ మిస్సైంది. మొత్తానికి ఫిబ్రవరి 22 న రిలీజ్ చేయటానికి డిసైడ్ అయ్యారు. అయితే ఇప్పుడు వారి ముందున్న పెద్ద సవాల్. ఈ చిత్రం థియోటర్ ట్రైలర్.

ఎందుకంటే ‘ఎన్టీఆర్ – క‌థానాయ‌కుడు’ చిత్రం డిజాస్టర్ ఎఫెక్ట్…మహానాయకుడు మీద పడకుండా చూడాలి. అంటే ట్రైలర్ అదిరిపోవాలి. అందుకోసం గత కొద్ది రోజులుగా నాలుగు టీమ్ లు ట్రైలర్ ని రెడీ చేసే పనిలో ఉన్నాయట. వాటిలో రెండు ఫైనల్ చేసి బాలయ్యకు పంపుతారు. వాటిలో ఒకటి బాలకృష్ణ ఫైనల్ చేస్తారని తెలుస్తోంది.

ఎన్.బి.కె ఫిల్మ్స్‌, వారాహి చలన చిత్రం, విబ్రి మీడియాలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ‘కథానాయకుడు’లో ఎన్టీఆర్‌ సినీ ప్రస్థానం నుంచి తెలుగుదేశం పార్టీ ప్రకటన వరకూ చూపించారు.

సెకండ్ పార్ట్ ‘మహానాయకుడు’లో ఆయన ఎలా పార్టీని స్థాపించారు? ప్రజాదరణతో ఎలా ముఖ్యమంత్రి అయ్యారు? తదితర పరిణామాలను చూపించనున్నారు. తొలి భాగంతో పోలిస్తే, రెండో భాగంపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా చంద్రబాబునాయుడు పాత్రలో రానా ఈ రెండవ భాగంలో ఎక్కువ సేపు కనపడతారు.