బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చిన చిత్రం ఎన్టీఆర్..‘కథానాయకుడు’. ఈ చిత్రానికి రివ్యూలు, టాక్ బాగున్నా… కలెక్షన్స్ పరంగా పూర్తిగా చతికిల పడిన సంగతి తెలిసిందే. రిలీజ్ రోజు సాయింత్రం నుంచీ కలెక్షన్స్ డ్రాప్ అవుతూ వస్తూ డిస్ట్రిబ్యూటర్స్ ని ముంచేసింది.ఫస్ట్ వీకెండ్ లో నే పూర్తి నష్టం అని గగ్గోలు ఎత్తబోయిన సిట్యువేషన్ వచ్చేసింది.
ఈ నేపధ్యంలో బాలకృష్ణ, ఆయన టీమ్ ఈ సినిమా ద్వారా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ ని ఆదుకునేందుకు నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించారని వార్తలు వచ్చాయి. అందుకు గానూ మహానాయకుడు చిత్రాన్ని ఫ్రీగా ఇస్తున్నారని చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి, కేవలం ఇరవై శాతం మాత్రమే నష్ట పరిహారం ఇచ్చి వేరే బయ్యర్లకు సినిమాని రిలీజ్ ఇచ్చే ప్లాన్ లో నిర్మాతలు ఉన్నారట.
అయితే ఇందుకు డిస్ట్రిబ్యూటర్స్ ఒప్పుకోవటం లేదు. ఈ విషయమై తర్జన భర్జనలు తేలటం లేదు. దాంతో రిలీజ్ డేట్ ఖరారుగా ఫలానా అని డిస్ట్రిబ్యూటర్స్ కు క్లారిటీ ఇవ్వటం లేదు. ఇదే కొనసాగితే రేపు ఎలక్షన్ కోడ్ వచ్చేస్తే రిలీజ్ చేయటం కష్టమైపోతుంది. సినిమా నిలిచిపోతుంది. అందుకే త్వరగా ఏదో ఒక సెటిల్మెంట్ కు వచ్చి రిలీజ్ డేట్ ప్రకటించటం మంచింది అంటున్నారు అభిమానులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.