బాలయ్య వెంటనే దృష్టి పెట్టకపోతే …భారీ నష్టమే

ఎన్టీఆర్  కథానాయకుడు చిత్రం హిట్ అయితే ఆ కథే వేరు . కానీ ఆ సినిమా డిజాస్టర్ అవటం కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. కొత్త లెక్కలు వేసుకోవాల్సిన పరిస్దితి ఏర్పడింది. ముఖ్యంగా ఈ సినిమాకు బజ్ క్రియేట్ చేయాల్సిన అవసం ఏర్పడింది. రెండు రోజుల క్రితం దాకా ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్స్ తో సెటిల్మెంట్ విషయాలు తేలలేదు. తేలేసరికి రిలీజ్ డేట్ దగ్గర పడింది. ఇప్పటిదాకా ఈ సినిమాకు పబ్లిసిటి ప్రారంభం చేయేదు. కథానాయకుడు సినిమాకు రోజుకో పోస్టర అన్నట్లుగా కుమ్మి పారేసారు. కానీ ఇప్పుడా సిట్యువేషన్ కనిపించటం లేదు.

ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే..అసలు బాలయ్య ఫ్యాన్స్ లోనే మహానాయకుడు రిలీజ్ తాలుకు జోష్ లేదు. ఈ నేపధ్యంలో శుక్రవారం వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్లకపోవటం , ఖచ్చితంగా ఫలానా రోజే అంటూ రిలీజ్ డేట్ లో ఫిక్స్ చేయకపోవటం ఇబ్బందులు తెచ్చిపెట్టింది.

పోనీ రిలీజ్ వాయిదా వేద్దాము అంటే… ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల చివరి వారం లేదా మార్చ్ మొదటి వారం రావడం ఖాయం అని తేలింది. ఆలోపు కనుక మహానాయకుడు విడుదల కాకపోతే పార్టీ పరంగా పార్టికి పెద్దగా కలిసొచ్చేదేమీ ఉండదు. అసలు లక్ష్యం దెబ్బ తింటుంది. నోటి ఫికేషన్ వచ్చాక రిలీజ్ చేస్తే పార్టీ వ్యవస్థాపకుడి మీద తీసిన సినిమా కాబట్టి విడుదల ఆగిపోయే ఛాన్స్ ఉంది. అలాగని ఎలక్షన్లు పూర్తి అయ్యాక రిలీజ్ చేస్తే ఏమిటి ఉపయోగం . వేరే దారి లేని తప్పని పరిస్థితిలో 22కే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు.

అయితే ఇక్కడే అసలు చిక్కు కనపడుతోంది. తక్కువ సమయం కాబట్టి ఈ సినిమాకు బజ్ తెచ్చేందుకు సరిపడా టైమ్ లేదు. పైగా ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ జనాల మనస్సులోంచి పోలేదు. దాంతో ఖచ్చింగా దాని ఇంపాక్ట్ ఓపినింగ్స్ పై పడుతుంది. ఈ నేపధ్యంలో మహానాయకుడి మీద దృష్టి జనా దృష్టి పడాలి అంటే కేక పెట్టించి, హాట్ టాపిక్ గా నిలిచే ఓ ట్రైలర్ నో లేదా వరసబెట్టి కొన్ని పోగ్రామ్ లు చేస్తేనో తప్ప ఊపు రాదు. ఇందుకు బాలయ్యే డెసిషన్ తీసుకుని ముందుకు దూకాలి. లేక పోతే భారీ నష్టం ఎదుర్కోవాల్సి వస్తుందనటంలో సందేహం లేదు.