తన పెదనాన్న చిరంజీవిని డాడీ అని పిలుచుకుంటూంది నీహారిక. యాంకర్‌గా, వెబ్ సిరీస్ ద్వారా, సినిమాతో తనేంటో ప్రూవ్ చేసుకున్న నీహారిక అంటే చిరుకు సైతం గారమే. ఈ నేపధ్యంలో తన పెద నాన్న ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రంలో ఆమెకు నటించాలని కోరిక పుట్టింది.
నిర్మాత తన అన్నయ్య రామ్ చరణ్ కావటంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి దర్శకుడు కు చెప్పేసాడు. అయితే ఆమెకు సరిపడ పాత్రలేమీ దర్శకుడు సురేంద్రరెడ్డి కు కనపడలేదు. ఆ విషయమే చెప్తే ..చిరంజివి సినిమాలో చిన్న పాత్రలో అయినా కనపడాలని ఆమె తన కోరిక వ్యక్తం చేసిందిట. దాంతో ఆమెకు ఈ సినిమాలో ఓ చిన్న పాత్ర ఇచ్చారట.
ఆమెది బోయ పిల్ల పాత్ర అని తెలుస్తోంది. ఆ పాత్రకు పెళ్లైన వెంటనే తన భర్తను ఓ బ్రిటీష్ దొర వలన కోల్పోతుంది. దాంతో ఆమె తిరగబడుతుంది. ఆమెకు నరసింహారెడ్డి సపోర్ట్ గా నిలుస్తాడని సమాచారం. ఆ పాత్రపై సానుభూతి కలుగుతుందని, ఆ సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని భావిస్తోంది టీమ్.
ఇక ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో అమితాబచ్చన్, విజయ్‌సేతుపతి, రవికిషన్, సుదీప్, తమన్నా తదితరులు కనిపించనున్నారు. ఈ చిత్రానికి స్వరాలను బాలీవుడ్ సంగీత దర్శకుడు త్రివేది సమకూర్చనున్నారు. ఛాయాగ్రహణం: ఆర్ రత్నవేలు, కూర్పు: శ్రీకర ప్రసాద్, నిర్మాత: రామ్ చరణ్.