ఇండస్ట్రీ టాక్ : “సలార్” మాస్ టీజర్ కి కొత్త ముహూర్తం ఖరారు??

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం చేస్తున్న కొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “సలార్” కూడా ఒకటి. కేజీఎఫ్ సినిమాలు తర్వాత వాటిని మించి భారీ ఏక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ చిత్రం ఇప్పుడు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుండగా..

ఈ సినిమా మాసివ్ ట్రీట్ కోసం ఇండస్ట్రీ వర్గాల్లో మళ్ళీ క్రేజీ టాక్ బయటకి వచ్చింది. నిజానికి ఈ చిత్రం నుంచి మాస్ టీజర్ లేదా గ్లింప్స్ గత మే నెల లోనే రిలీజ్ చెయ్యాల్సి ఉంది. కానీ మేకర్స్ తర్వాత ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ప్రభాస్ ఫ్యాన్స్ కి నిరాశ మిగిల్చారు.

అసలే రాధే శ్యామ్ ప్లాప్ బాధలో ఉన్న వారు సలార్ టీజర్ తో అయినా కొంచెం రికవర్ అవుదాం అని చూసారు. కానీ లాస్ట్ కి వారికి చుక్కెదురయింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఫైనల్ గా సలార్ మాస్ ట్రీట్ పై ఇండస్ట్రీ వర్గాల్లో క్రేజీ బజ్ వైరల్ అవుతుంది.

దీని ప్రకారం అయితే ఈ జూలై రెండో వారం 14కి అలా రిలీజ్ చెయ్యొచ్చు అనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇంకా సరైన క్లారిటీ అయితే ఇంకా తెలియరాలేదు. మరి నిజంగానే వస్తుందో లేదో చూడాల్సిందే. ఇంకా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.