ఫైనల్ గా క్రిష్ …ఆ హీరోతో షూట్ కి రెడీ

ఫైనల్ గా క్రిష్ …ఆ హీరోతో షూట్ కి రెడీ

తెలుగులో చేసినవి అతి కొద్ది సినిమాలే అయినా చెప్పుకోదగ్గ పేరు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్. తన తొలి చిత్రం గమ్యం నుంచి ఆయన సినిమాలు విభిన్నంగా ఉంటూ వస్తున్నాయి. అయితే ఆయన చిత్రాలు ఏవీ ఈ మధ్యకాలంలో భాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కవుట్ కాలేదు. హిందీలో చేసిన మణికర్ణిక చిత్రం అనేక అపవాదులు , వివాదాలు తెచ్చిపెట్టింది. మరో ప్రక్క తెలుగులో చేసిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్ట్ లు డిజాస్టర్ అయ్యాయి. దాంతో ఆయన తప్పనిసరి బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ నేపధ్యంలో ఆయన తన తదుపరి చిత్రం ఏం చేయబోతున్నాడా అనేది మీడియాలో చర్చనీయాంశం అయ్యింది.

అందుతున్న సమాచారం మేరకు ఆయన ఇప్పుడు నాగశౌర్య ని డైరక్ట్ చేయటానికి రెడీ అవుతున్నారు. ఈ ప్రాజెక్టుకు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మాత. ఇదో రొమాంటిక్ డ్రామా కావటం విశేషం. మూడు లవ్ స్టోరీలు ముగ్గురు డైరక్టర్స్ డైరక్ట్ చేస్తారు. వాళ్లను కో ఆర్డినేట్ చేస్తూ క్రిష్ ఓ స్టోరీ ని డైరక్ట్ చేస్తారు.

నాగశౌర్య రీసెంట్ గా సమంత నటించిన ఓ బేబిలో కీలకమైన పాత్రను చేసారు. ఆ తర్వాత వరసగా సినిమాలు ఉన్నాయ. ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తి కాగానే ఈ సినిమాని పట్టాలు ఎక్కిస్తారు. త్వరలోనే ఈ విషయమై ఎనౌన్సమెంట్ వస్తుంది. ఈ ప్రాజెక్టు తర్వాత హిందీలో ఓ సినిమా ని క్రిష్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.