Venkatesh: వెంకటేష్ హీరో కాకపోయి ఉంటే ఆ పని చేసేవారా… ఇన్నాళ్లకు బయటపెట్టిన హీరో?

Venkatesh: సినీ నటుడు వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగ వంతం చేశారు.

ఈ క్రమంలోనే బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వెంకటేష్ తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు తన వృత్తిపరమైన విషయాలను అలాగే తన పిల్లలు ఫ్యామిలీ గురించి కూడా ఎన్నో విషయాలను వెల్లడించారు. అయితే బాలయ్య వెంకటేష్ ని ప్రశ్నిస్తూ ఒకవేళ సినిమాలలోకి హీరోగా రాకపోయి ఉంటే ఏం చేసేవారని ప్రశ్న వేశారు.

ఈ ప్రశ్నకు వెంకటేష్ సమాధానం చెబుతూ నాకు ఫారిన్ వెళ్లి అక్కడే తిరగాలని కోరిక ఉండేది. ఒక బీచ్ పక్కన ఇల్లు కట్టుకొని అక్కడ నివసించాలని కోరిక ఉండేది కానీ ఇక్కడికి వచ్చి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను అయితే ఆ బిజినెస్ అట్టర్ ప్లాప్ అయిందని వెంకటేష్ తెలిపారు. ఇలా బిజినెస్ పోవడంతో నాన్న ఒకసారి రాఘవేంద్రరావు గారిని పిలిచి ఇలా మావాడు ఉన్నాడు అని చెప్పడంతో ఆయన అడిగితే కలియుగ పాండవులు సినిమా చేశాను.

సరే ఇది కూడా ఒక ట్రయిల్ వేద్దామని సినిమాలు మొదలుపెట్టాను. అలా సినిమాలు మొదలు పెట్టడంతో సినిమానే తిరిగి తన వృత్తిగా మారుతుందని అనుకోలేదు అంటూ ఈ సందర్భంగా వెంకటేష్, తన సినీ కెరియర్ గురించి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.