కీర్తీ సురేష్‌కు ఇక డైట్‌లు, ఎక్సర్‌సైజ్‌లు తప్పవు!

Keerthi Sures gets bollywood chance
 కీర్తీ సురేష్‌కు బాలీవుడ్‌ నుంచి కాల్‌ వచ్చింది. అక్కడి సినీ ప్రియులకు హీరోయిన్లు బొద్దుగా ఉంటే నచ్చరు. కీర్తీ సురేష్‌ స్లిమ్‌గా మారాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక డైట్‌లు… ఎక్సర్‌సైజ్‌లు అంటూ చేయక తప్పలేదు. దాంతో ఈ అందాల బొమ్మ చిక్కి మరింత చక్కగా తయారైంది.
 
కీర్తీ సురేష్‌ ప్రస్తుతం అజయ్‌ దేవగణ్‌ స్పోర్ట్స్ బయోపిక్‌ ‘మైదాన్’ లో చేస్తోంది . ప్రస్తుతం నరేంద్రనాథ్‌ దర్శకత్వంలో ‘మిస్ఇండియా’, నగేష్‌ కుకునూరు దర్శకత్వంలో ‘గుడ్ లక్ సఖి’ ..నితిన్ తో ‘రంగ్ దే’ .. మలయాళంలో మోహన్ లాల్ తో ‘మరక్కర్’ చేస్తోంది . తమిళంలో ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వంలో కీర్తీ సురేష్‌ నటించిన లేడీ ఓరియంటెడ్‌ మూవీ ‘పెంగ్విన్ ‘. ‘పిజ్జా’, ‘పేట’ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు ఈ సినిమాకు ఓ నిర్మాత. ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ గర్భవతి పాత్రలో నటించారు.
 
కీర్తీసురేష్ రజనీకాంత్ కొత్త చిత్రంలో, శివ దర్శకత్వంలో రజని కూతురుగా నటిస్తోందని అంటున్నారు.
 
Keerthi Suresh got a call from Bollywood. Keerthi Suresh is on an exercise spree to reduce her weight and get into slim mode to suit Bollywood audience