కాజల్ చిన్న పొరపాటు… జనం ఆడేసుకుంటున్నారు

Kajal Agarwal

 కాజల్ కు టైమ్ బ్యాడ్, జనం ఫుట్ బాల్ ఆడుతున్నారు

 

‘రణరంగం’లో తాను చేసింది డాక్టర్ పాత్ర అని.. సెకెండ్ హాఫ్‌లో తన క్యారెక్టర్ ఎంటరవుతుందని చెప్పిన కాజల్.. చాలామంది ఈ సినిమా ఎందుకు చేశావు అంటున్నారని.. కథ, పాత్ర నచ్చబట్టే ఈ సినిమా చేశానని.. తన పాత్ర వల్లే కథ ముందుకు నడుస్తుందని.. సినిమా చూశాక తానెందుకు ‘రణరంగం’ ఒప్పుకున్నానో అర్థమవుతుందని చెప్పింది కాజల్. అయితే సినిమా చూసిన వాళ్లవరకీ ఆ పాత్ర అంత ఉదాత్తంగా, గొప్పగా కనిపించలేదు. అసలు ఏ మాత్రం ప్రాధాన్యత లేని ఆ పాత్ర గురించి కాజల్ చెప్పిన మాటలు ఇప్పుడు ఓ రేంజిలో ట్రోల్ అవుతున్నాయి.

శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని కాంబినేషన్లో దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించిన చిత్రం ‘రణరంగం’. గ్యాంగ్‌స్టర్ జీవితం నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 15 న విడుదలైంది.అయితే మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చేసుకున్న ఈ చిత్రం లో కాజల్ ఎందుకు చేసిందనే విషయం అందరికీ ఆశ్చర్యంగా మారింది.

ఆమె లాంటి సీనియర్ స్టార్ హీరోయిన్ కు సరపడ స్క్రీన్ టైమ్ కూడా లేదు. అంతేకాదు అసలు సినిమాలో ఆమె పాత్రకు ప్రయారిటీనే లేదు. దాంతో ఇవన్నీ తెలియకుండా కాజల్ చేసి ఉంటుందా..కేవలం డబ్బు కోసమే చేసి ఉంటుందనే నిర్ణయానికి వచ్చి ..సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం మొదలెట్టారు. అప్పటికీ కాజల్ ఈ చిత్రం ప్రీ రిలీజ్ పంక్షన్ లోనూ కనపడలేదు. ఆ తర్వాత కూడా ఎక్కడా ప్రమోట్ చెయ్యలేదు.

<

p style=”text-align: justify”>అంటే ఆమెకు తన పాత్ర మాత్రమే కాదు..సినిమా కూడా వర్కవుట్ కాదని తెలిసే ఇలా చేసిందంటున్నారు. ప్రస్తుతం కాజల్ కు కెరీర్ లో కీలకమైన దశ నడుస్తోంది. హీరోయిన్ గా ఆఫర్స్ తగ్గిపోతున్నాయి. మునపటి ఛామ్ ఆమెలోనూ లేదు. అంటే గ్యాప్ తీసుకునే టైమ్ వచ్చేసింది..తిరిగి మళ్లీ ఏ అక్క పాత్రలోనో లేక అమ్మ పాత్రలోనే కనపడనుందన్నమాట అని ఆమెను టార్గెట్ చేస్తూ మాటలు అంటున్నారు.