రాజమౌళి సెంటిమెంట్ ని ప్రభాస్ బ్రేక్ చేస్తాడా?

రాజమౌళి సెంటిమెంట్ ని ప్రభాస్ బ్రేక్ చేస్తాడా?

రాజమౌళితో సినిమా చేసి సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత ఆ హీరోలకు ఇమ్మిడియట్ నెక్ట్ ప్రాజెక్టు డిజాస్టర్ అవుతూ వస్తోంది. అందుకు కారణం రాజమౌళి సినిమాతో ఆ హీరోలపై పెరిగిపోయే అంచనాలే. వాటిని అందుకోలేక ఆ సినిమాలు వర్కవుట్ కావటం లేదు. బాహుబలి సినిమాతో అవి మరింతగా పెరిగాయి. ప్రభాస్ నేషనల్ హీరో అయ్యిపోయారు. దాంతో ఇప్పుడు ప్రభాస్ తాజా చిత్రం సాహో రిజల్ట్ ఎల ఉండబోతోందనే చర్చ అంతటా మొదలైంది. ఖచ్చితంగా బాహుబలి ప్రభావం సినిమా ఓపినింగ్స్ పై ఉంటుంది. సాహో ని సైతం బాహుబలి తో పోల్చి చూస్తారు. అయితే బాహుబలికి సమానంగా లేదా అంతకు మించి ఉంటేనే వర్కవుట్ అవుతుంది. ఇది ఓ రకంగా పెద్ద టాస్కే.

‘బాహుబలి’ సిరీస్ ప్రభాస్ నటించిన ఈ మూవీపై తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్ర సీమల్లోను భారీ ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే సినిమాను తెరకెక్కించనట్లు ఆ మద్య వచ్చిన టీజర్ ద్వారా అర్దమైంది. అలాగే ఈ సినిమాను ముందుగా ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.. కానీ ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో పాటు గ్రాఫిక్స్ పనుల కారణంగా ఈ సినిమాను రెండు వారాలు ఆలస్యంగా ఆగష్టు 30న విడుదల చేయనున్నట్టు ‘సాహో’చిత్ర యూనిట్ అఫీషియల్‌గా రీసెంట్ గా ప్రకటించింది.

ఈ లోగా మధ్య మధ్యలో క్రేజ్ కోసం కొత్త పోస్టర్స్ ని,పాటలను వదులుతోంది టీమ్. సుజీత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ప్రభాస్, శ్రద్ధాలతో పాటు ఇంకా ఈ సినిమాలో నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, అరుణ్‌ విజయ్‌‌లు కీలక పాత్రలు చేస్తున్నాారు.. ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.