హిట్స్ కోసం తపిస్తున్న నిన్నటి టాప్ హీరోయిన్ !

హిట్స్ కోసం తపిస్తున్న నిన్నటి టాప్ హీరోయిన్

అడుగు పెడుతూనే అందలం ఎక్కాలనుకుంది.. వచ్చిన అవకాశాలను ఎడా పెడా ఖాతాలో వేసుకుంది. జోరును పెంచింది. ప్చ్.. ఏం చేస్తాం! బోరున విలపిస్తూ  బొక్క  బోర్లా  పడింది. ఇంతకీ ఎవరబ్బా అనుకుంటున్నారా ?  
 
అదేనండీ సెక్సీ… సెక్సీ… అంటూ తెగపొగిడారే ఆమే రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు, తమిళం అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తూ కెరీర్ ని యమా ఫాస్టుగా పరుగులు పెట్టించాలనుకుంది. కానీ, తను అనుకున్నవేవీ సాగలేదు. తాను చేసిన పొరపాట్లు తొందరగానే గ్రహించింది.
 
ఈలోపే కెరీర్ సందిగ్ధంలో పడింది. ఇప్పుడు హిట్స్ కోసం తపిస్తోంది. ఈ బ్యూటీ కి హిట్స్ కరువయ్యాయనే  చెప్పాలి. కోలీవుడ్ లో సూర్య సరసన చేసిన ఎన్ జీ కే చిత్రం పై పెట్టుకున్న ఆశలన్నీ నీరుగారి పోయాయి.  కో లీవుడ్ లో దేవ్ చిత్రం తర్వాత రకుల్ చవిచూసిన రెండవ పరాజయం ఇది.  
 
ఇక తెలుగు లోనూ ఈ జాణ కు అర్జెంట్ గా ఒక్కటంటే ఒక్క హిట్ కావాలి. తాజాగా కింగ్ నాగార్జునతో మన్మధుడు-2 లో ఆడి పాడ బోతోంది. ఈ చిత్రం పై గంపెడాశలు  పెట్టుకుంది.  అంతే కాదు,  కోలీవుడ్ లో విజయ్ సరసన సినిమా చేయబోతోందని జోరుగా ప్రచారం సాగుతోంది.
 
ఇవే గాక మరిన్ని చిత్రాల్లో అవకాశాల కోసం తెగ ప్రయత్నాలు చేస్తూ పరిశ్రమ అంతా కలియ తిరుగుతోంది. అందులో భాగంగానే గ్లామర్ తో కూడిన ఫొటోలు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ తెగ హడావుడి చేస్తూ అందరిలో అలజడి రేపుతోంది. అదీ సంగతీ.. చూద్దాం. ఈ అమ్మడి ఆటను తనివితీరా!