గాసిప్స్ : ఒకే స్టేజ్ పై కనిపించనున్న పవన్ – బాలయ్య లు..జరిగే పనేనా.?

ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న చాలా మంది హీరోలు అయితే ఏ ఒక్కరు కూడా కేవలం ఒకే పని చేయట్లేదని చెప్పాలి. ఒకే సమయంలో రెండు సినిమాలు గాని అలాగే ఒకే సమయంలో అటు రాజకీయాలు అలాగే సినిమాలు కానీ ఇలా చేస్తున్నారు.

మరి అలాంటి ఇద్దరు పర్సనాలిటీస్ అందులోని రెండు వేరు వేరు కుటుంబాలు అయినటువంటి హీరో లు ఒకే వేదికపై నిలుచోడం అసాధ్యం అయితే అది ఒక ఎంటర్టైనింగ్ ప్రోగ్రాం కోసం అంటే అది షాకింగ్ అని చెప్పాలి. మరి అలాంటి కాంబోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు నందమూరి బాలకృష్ణ లదే అని చెప్పి తీరాలి.

బాలయ్య ఇప్పుడు ఓ పక్క సినిమాలు, రాజకీయాలు షో లు కూడా చేస్తున్నారు. అలాగే పవన్ కూడా సినిమాలు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. పైగా రెండు వేరు వేరు పార్టీలు కూడా..సరే ఇది బాగానే ఉన్నా బాలయ్య చేసే టాక్ షో లో పవన్ కళ్యాణ్ కనిపించే ఛాన్స్ ఉందని ఇప్పుడు సినీ వర్గాల్లో గాసిప్స్ స్టార్ట్ అయ్యాయి.

బాలయ్య ఆహా లో చేస్తున్న టాక్ షో అన్ స్టాప్పబుల్ కి గాని ఈసారి రెండో సీజన్లో పవన్ ఓ గెస్ట్ గా కనిపిస్తాడని అంటున్నారు. అయితే అసలు ఇది జరిగే పని కాదని చెప్పాలి. పవన్ సినిమా వేడుకలకే దూరంగా ఉంటాడు పైగా తన సినిమాల ప్రమోషన్స్ కి కూడా వెళ్లడు అలాంటిది బాలయ్యతో షోలో పాల్గొనడం అనేది అస్సలు జరిగే పని కాదని చెప్పొచ్చు.