ఏంటి …క్రిష్ కి కూడా ఆ పిచ్చ ఉందా!

డైరక్టర్ క్రిష్ గురించి తెలిసిన వారు …ఆయన ఆలోచనలు ఎంత పద్దతిలో ..పోగ్రిసెవ్ ఎప్రోచ్ తో ఉంటాయో అని మెచ్చుకుంటూంటారు. మూఢ నమ్మకాలకు, కాస్ట్ ఫీలింగ్ లకు ఆయన చాలా దూరంగా ఉంటారని చెప్తూంటారు. కష్టమే ఫలిస్తుందని, అదృష్టం అనేది నమ్మకమే అని ఆయన అంటూంటారు. అయితే తాజాగా ఆయన లక్కి నెంబర్ కోసం పెట్టిన ఖర్చు చూసి…ఇదేంటి క్రిష్ కు ఇలాంటి నమ్మకాలు, పిచ్చి కూడ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.

సాధారణంగా సినిమా స్టార్స్ తమ కార్లకు ఫ్యాన్సీ నెంబర్ లను తీసుకోవడం మనం గమనిస్తాం. సెలబ్రెటీలు కారు నెంబర్లు వారి స్టేటస్ సింబల్ గా భావిస్తూంటారు కాబట్టి ఇందులో వింతకూడా ఏమీ లేదు. అయితే క్రిష్ కూడా ఇలా ఫ్యాన్సీ నెంబర్ కోసం డబ్బు ఖర్చు పెట్టడమే ఆశ్చర్యంగా ఉంది. తాజాగా ఆయన తన కొత్త కారు కోసం ఏకంగా 9 లక్షలు పెట్టి నెంబర్ తీసుకుని ఆశ్చర్యపరిచారు.

ఖైరతాబాద్ ఆర్ టీ ఏ ఆఫీస్ లో తన కొత్త ఎస్ యూ వి కారుకు గాను అన్ని 9 నెంబర్ లు కలిగిన ప్యాన్సీ నెంబర్ ను కొనుగోలు చేశాడు. ఇక్క విశేషం ఏంటీ అంటే TS 09 FC 9999 నెంబర్ కు క్రిష్ 9 లక్షలు ఖర్చు చేయటమే. క్రిష్ తన 1.37 కోట్ల కారుకు 9 లక్షలు ఖర్చు పెట్టి నెంబర్ తీసుకోవడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.

ప్రస్తుతం క్రిష్ నందమూరి బాలకృష్ణ తో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జనవరి 09 న ఈ బయోపిక్ కు సంబందించిన మొదటి పార్ట్ కథానాయకుడు విడుదల కానుంది.